సాధారణంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించడం అంటే కేవలం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లకు మాత్రమే సాధ్యమవుతుంది.చిన్న మ్యూజిక్ డైరెక్టర్ లకు పెద్దగా అవకాశాలు రావు.
వచ్చిన ఒకటో రెండో సినిమాలకు సంబంధించి మాత్రమే వస్తూ ఉంటాయి.కానీ ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కేవలం వారం వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని తెలుస్తోంది.
ఇప్పటికే నీది నాది ఒకే కథ అనే సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు సురేష్ బొబ్బిలి.ఇక ఆ తర్వాత జార్జి రెడ్డి సినిమా తో తనలో దాగివున్న క్రియేటివిటీని బయటపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు.
ఇక ఇప్పుడు కేవలం జూన్ నెలలోనే వరుసగా మూడు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల టేకింగ్ లో రూపొందిన చిత్రం విరాటపర్వం.సాయి పల్లవి ప్రధాన పాత్రలో రానా హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్ లాంటి ఎంతో మంది నటీనటులు భాగమయ్యారు.
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.ఇప్పటికే ఈ సినిమాలోని సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక అదే సమయంలో జూన్ 24వ తేదీన జార్జి రెడ్డి డైరెక్టర్ జీవన్రెడ్డి తెరకెక్కించిన చోర్ బజార్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాకు కూడా అటు సురేష్ బొబ్బిలి సంగీతం అందించడంగమనార్హం.ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే జూన్ 24వ తేదీన శ్రీరామ్, అవికా గోర్ జంటగా గరుడవేగ ఫేమ్ అంజి రూపొందించిన టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు సురేష్ బొబ్బిలి.
ఇలా వారం వ్యవధిలోనే మూడు సినిమాలతో తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపింప చేసేందుకు సిద్ధమయ్యాడు.