రానా మరియు సాయి పల్లవి కీలక పాత్రలో నటించిన విరాటపర్వం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన విరాట పర్వం సినిమా గత మూడు నాలుగు సంవత్సరాలుగా వార్తల్లో నిలిచింది.
కాని సినిమా విడుదల సమయంకు వచ్చేప్పటికి ఈ సినిమా ఒక వర్గం వారికి మాత్రమే అని.ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు అంటూ చాలా మంది బలంగా బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో విరాటపర్వం సినిమాకు చేస్తున్న పబ్లిసిటీ సరిపోవడం లేదని.ఈ హంగామా ను మించి ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా విరాటపర్వం సినిమా ఎక్కువ మందికి చేరుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో విరాట పర్వం సినిమా గురించి ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.కాని సినిమా విడుదల అవుతున్న రూరల్ ఏరియాల్లో మాత్రం సినిమా గురించిన చర్చ ఏం జరగడం లేదు.
క్లాస్ వారికి ఈ సినిమా ఎంత వరకు ఎక్కుతుందో తెలియదు.కనీసం మాస్ ఆడియన్స్ కు చేరువ అయ్యేలా అయినా సినిమా ను ప్రమోట్ చేయాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తు ఉంటే మరి కొందరు మాత్రం సినిమా విడుదల కు ముందు ఎలాంటి టాక్ ఉన్నా కూడా కచ్చితంగా విడుదల తర్వాత మౌత్ టాక్ తో ఓ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతుంది.

కేవలం ఒక వర్గం వారు మాత్రమే కాకుండా విడుదల తర్వాత వచ్చే టాక్ తో అన్ని వర్గాల వారు థియేటర్ల ముందు క్యూ కడుతారు అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ కు మరియు సంఘటనలకు ఈ సినిమా రూపం అన్నట్లుగా దర్శకుడు వేణు ఉడుగుల చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా ఉంది.ఆమె కోసం అయినా సినిమా చూడాలి అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.కనుక పాజిటివ్ కలెక్షన్స్ వస్తాయేమో చూడాలి.