అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్‌, బెస్ట్ చెఫ్ రెండు అవార్డులు భారతీయులకే...!!!

భారత సంతతికి చెందిన చెఫ్, భారతీయ రెస్టారెంట్ అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక ‘‘ culinary awards’’ను గెలుచుకున్నాయి.న్యూయార్క్‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘ధమాకా’కు చెందిన చింతన్‌ పాండ్యా James Beard Award for “Best Chef: New York State”ను గెలుచుకోగా.నార్త్ కరోలినాలోని ఆషెవిల్లేలో వున్న ‘చాయ్ పానీ’ రెస్టారెంట్‌ అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్ అవార్డ్‌ను అందుకుంది.జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ 2022 ఈ అవార్డులను ప్రకటించింది.

 Indian-origin Chef, Indian Restaurant Win Top Honours At America’s Most Presti-TeluguStop.com

ఇకపోతే.చింతన్ పాండ్యా అమెరికాలోని ప్రముఖ భారతీయ చెఫ్‌లలో ఒకరు.ఆయన నేతృత్వంలో అనేక రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు వున్నాయి.కోవిడ్ 19 కాలంలో గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ‘ధమాకా’ రెస్టారెంట్‌ 2021లో న్యూయార్క్ టైమ్స్ టాప్ 10 కొత్త రెస్టారెంట్‌ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

అలాగే 2021 సంవత్సరానికి గాను న్యూయార్క్‌ టైమ్స్ జాబితాలో అమెరికాలోని అత్యంత శక్తివంతమైన, రుచికరమైన రెస్టారెంట్లలోనూ స్థానం సంపాదించింది.మరోవైపు.2009లో ప్రారంభమైన చాయ్ పానీ రెస్టారెంట్… భారతీయ స్నాక్స్‌ను అందుబాటు ధరల్లోనే ఆహార ప్రియులకు అందిస్తోంది.చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.

అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్ గా చాయ్ పానీని నిర్వాహకులు ఎంపిక చేశారు.న్యూ ఓర్లాన్స్ కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచింది.ఈ రెస్టారెంట్‌లో క్రంచీ చాట్ 8.49 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి.థాలీ వంటకాలు 16.99 డాలర్ల నుంచి విక్రయిస్తున్నారు.వడా పావ్, పావ్ బాజీ ఒక్కోటీ 10.99 డాలర్లు.చికెన్ టిక్కా రోల్ 11.99 డాలర్లు.

Telugu America, Chaipani, Chintan Pandya, Culinary Awards, Dhamaka, Indians, Jam

కాగా.ఇటీవల న్యూయార్క్‌లోని మిచెలిన్ స్టార్ సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా గెజిట్ రివ్యూ ద్వారా ప్రపంచంలోని టాప్ 10 గ్లోబల్ చెఫ్‌లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే.అంతేకాదు.ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ చెఫ్‌గా నిలిచారు.ఈ గెజిట్ రివ్యూ ఖన్నాకు ఆరవ ర్యాంక్ ఇచ్చింది.బ్రిటీష్ చెఫ్ గోర్డాన్ రామ్‌సే ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆంథోనీ బౌర్టెన్, పాల్ బోకస్, అలైన్ డుకాస్సే, ఎమెరిల్ లగాస్సే, మార్కో పియరీ వైట్, పెస్టన్ బ్లూమెంటల్, వోల్ఫ్ గ్యాంగ్ పుక్, జామీ ఆలివర్‌ వంటి దగ్గజ చెఫ్‌లు ఈ జాబితాలో వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube