ఆకట్టుకుంటున్న సుమంత్ "అహం రీబూట్" ఫస్ట్ గ్లింప్స్

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా “అహాం రీబూట్“.చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం “అహం రీబూట్” సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది.తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్గ్లింప్స్) టీజర్ ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.కాన్సెప్ట్ ను తెలుసుకొని టీమ్ ని అభినందించారు.

 Hero Sumanth's aham Reboot Movie First Glimpse , Aham Reboot, Hero Sumanth, Hero-TeluguStop.com

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలై లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.

అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది.ఇందులో సుమంత్ ఆర్జే నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు.

కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలయ్ కు ఫోన్ చేస్తుంది.ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు కథానాయకుడి సాయాన్నిరేడియో ద్వారా కోరుతుంటారు.

మరి వాళ్లను అతను ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా ఉండబోతోంది.ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

ఒక యునిక్ కాన్సెప్ట్ ను థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయడం అహం రీబూట్ కి బలం గామారుతుంది అని టీమ్ నమ్ముతుంది.హీరో సుమంత్ నటన ప్రత్యేకం గాఉండబోతోంది.

సంగీతం – శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ – వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్ విజన్ – సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ – ఏఆర్ వంశీ, సౌండ్ -నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – రఘువీర్గోరిపర్తి, సృజన్ యరబోలు, రచన దర్శకత్వం – ప్రశాంత్ సాగర్ అట్లూరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube