టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా ఆ ఎఫెక్ట్ చరణ్ పై పడలేదు.
చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమా అటు శంకర్ కెరీర్ లో ఇటు రామ్ చరణ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
చరణ్ ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత చరణ్ సుకుమార్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది.
సుకుమార్ ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.మరోవైపు చరణ్ ఉపాసన తాజాగా పెళ్లిరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారనే సంగతి తెలిసిందే.
అయితే చరణ్ ఉపాసన పిల్లలకు సంబంధించిన శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే చరణ్ ఉపాసన అప్పుడే పిల్లలు వద్దని అనుకోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
కెరీర్ విషయంలో సాధించిన లక్ష్యాలు ఉండటంతో చరణ్ పిల్లలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం.గర్భం విషయంలో కొన్ని భయాలు ఉండటం ఉపాసన బరువు తగ్గాలని నిర్ణయం తీసుకోవడం వల్లే పిల్లల్ని కనటానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పట్లో పిల్లలు వద్దని చరణ్, ఉపాసన కలిసి నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మరింత ఎదగటానికి కృషి చేస్తున్నారు.చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ఈ సినిమాలు చరణ్ రేంజ్ ను మరింత పెంచుతాయేమో చూడాల్సి ఉంది.