కన్నవారికి అసలైన గుండెకోత ఎప్పుడో తెలుసా?

కన్నవారికి అసలైన గుండెకోత ఎప్పుడో తెలుసా .కళ్లెదుటే బిడ్డల్ని బొందల గడ్డలో పెట్టినప్పుడు .

 Did The Kannavas Ever Know The Actual Heart Attack, Gedela Mohan Rao, Visakhapat-TeluguStop.com

ఆ కడుపుకోత ఎవరూ తీర్చలేనిది .పెళ్లయినా ఐదేళ్లకే భర్తని కోల్పోయిన ఆమె .కొడుకే జీవితంగా బతికింది .ఆమె ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది .ఐదేళ్లకే భర్తని తీసుకుపోయిన ఆ దేవుడికి ఆమె మీద కోపం ఇంకా తగ్గలేదేమో .చేతికందే వయస్సులో 24 ఏళ్లు వచ్చిన తన కొడుకును కూడా కోల్పోయేలా చేశాడు .ఏకాకైన ఆమే చివరికి కన్నకొడుకు చితికి తలకొరివి పెట్టాల్సిన గతి పట్టింది .ఒక తల్లికి ఇంతకి మించిన గుండెకోత మరోటి ఉండదేమో .!

సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన గేదెల మోహన్ రావు ( 24 ) విశాఖపట్నంలో బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు .తండ్రి రమేశ్ తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోగా .అన్నీ తానై తల్లి ఢిల్లమ్మ కొడుకును పెంచింది .కూలి పనులు చేసుకునే ఢిల్లమ్మకు కొడుకు మోహన్ రావు ఆర్థిక అండగా నిలుస్తూ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నారు .ఈ క్రమంలో ఈ నెల 10 వ తేదీన ఇంటి పనులు చేస్తుండగా .భవనం నుంచి జారి కిందపడ్డాడు .దాంతో తలతో పాటు ఇతర భాగాలకూ గట్టి దెబ్బలు తగిలాయి .వెంటనే మోహన్ రావును విశాఖపట్నంలోని కేజీహెచ్ చేర్పించారు .అయితే , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ రావు శనివారం మృతిచెందాడు .పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామమైన కాపుగోదాయవలస గ్రామానికి తీసుకొచ్చారు .కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో తల్లి ఢిల్లమ్మే తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది .ఇది చూసిన గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube