సింహాన్ని ఒకేసారి చుట్టుముట్టిన 40 మొసళ్లు.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే షాకే..!

అడవికి రాజు సింహం ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడదు.అయితే ఒక్కోసారి ప్రాణహాని ఉందంటే అవి కూడా ప్రాణభయంతో పరిగెత్తుతాయి.

 40 Crocodiles Circling The Lion At Once .. Shake If You Know What Happened After-TeluguStop.com

కానీ ఇటీవల ఒక సింహానికి పరిగెత్తడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.ఎందుకంటే అది ఒక నీటి కొలనులో 40 మొసళ్ల మధ్య చిక్కుకుపోయింది.

నీటిలో ఇది చనిపోయిన ఒక హిప్పో కళేబరంపై నిల్చొని ఉంది.దీన్ని చూసిన మొసళ్ళ అన్నీ కలిసి దాని మీద ఎటాక్ చేయడానికి దూసుకొచ్చాయి.

దీంతో బాగా భయపడిపోయిన సింహం ఏం చేయాలో అర్థం కాక కాసేపు అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత ధైర్యం చేసి ముందుకు దూకింది.

తర్వాత ఏమైందో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక సింహం హిప్పో కళేబరంపై నిల్చొని ఉండటం గమనించవచ్చు.

ఆ తర్వాత నాలుగైదు మొసళ్లు ఒక్కసారిగా సింహంపై దాడి చేసేందుకు ఆ కళేబరం పైకి ఎక్కడానికి ప్రయత్నించడం చూడొచ్చు.దాంతో హడలిపోయిన ఆ సింహం నీటిలోకి దూకి శరవేగంగా ఒడ్డు మీదకి చేరుకుంది.

దీంతో ప్రాణాపాయం తప్పినట్లు అయింది.

మే 23న కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో ఆంటోనీ పెసి ఈ వీడియోను చిత్రీకరించారు.

అనంతరం ఈ వీడియోని యూట్యూబ్ లో షేర్ చేయగా.దీనికి ఇప్పటికే 12 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిపై నెటిజన్లు “ఓరి నాయనో ఇలాంటి సిచువేషన్ లో ఉంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే” అని కామెంట్లు పెడుతున్నారు.ఈ సింహం మాములు లక్కీ కాదని మరొకరు కామెంట్ పెట్టారు.

ఈ షాకింగ్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube