ఎన్నో ఏళ్లుగా ప్రేమ, ఇతర వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన హీరోయిన్లలో నయనతార ఒకరు.కొన్నేళ్ల క్రితం శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉన్న నయనతార కొన్ని కారణాల వల్ల వాళ్లతో విడిపోయారు.
ఆ తర్వాత నేనూ రౌడీనే మూవీ షూటింగ్ సమయంలో విఘ్నేష్ శివన్ నయనతారల మధ్య పరిచయం ఏర్పడింది.కొంత కాలానికే ఆ పరిచయం ప్రేమగా మారింది.
ఈ నెల 9వ తేదీన మహాబలేశ్వరంలోని ఒక రిసార్ట్ లో నయన్ విఘ్నేష్ ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
ఈ వివాహం కోసం నయన్ విఘ్నేష్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే నయన్ విఘ్నేష్ ల పెళ్లికి నయనతార తల్లి హాజరుకాలేదు.నయన్ విఘ్నేష్ ప్రస్తుతం కేరళలో వేర్వేరు దేవాలయాలను, ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తున్నారు.ఇప్పటివరకు మీడియాకు దూరంగా ఉన్న నయనతార ఇకపై ఆ విషయంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.
నయనతార తల్లి పెళ్లికి హాజరు కాకపోవడంతో ఈరోజు నయన్ విఘ్నేష్ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

నయనతార తల్లి పేరు ఒమయ కురియన్ కాగా నయన్ విఘ్నేష్ పెళ్లి ఇష్టం లేకపోవడం వల్లే ఆమె పెళ్లి చేసుకోలేదా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.నయన్ విఘ్నేష్ కేరళలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన చెట్టికులంగర దేవి టెంపుల్ లో పూజలు చేశారని బోగట్టా.

నయనతార విఘ్నేష్ శివన్ అన్యోన్యంగా జీవనం సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.విఘ్నేష్ శివన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో సైతం నయనతార హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.కెరీర్ విషయంలో నయనతార ఆచితూచి అడుగులు వేస్తున్నారు.నయనతారకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది.నయన్ ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.







