ఆ జైలులోకి వెళితే వద్దన్నా మళ్ళీ మళ్ళీ మీరే వెళ్తారు.. ఎందుకంటే..??

జైలు పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగేడతాయి.ఎందుకంటే జైలు శిక్ష అంటే ఎవరికన్నా భయమే కదా.

 Vijayawada Food Jail Themed Restaurant Viral On Social Media Details, Food Jail,-TeluguStop.com

అందుకు ఎవరయినా సరే జైలు మాట వింటే చాలు ఆమడ దూరం పరుగెడతారు.అలాంటిది ఇప్పుడు చెప్పబోయే జైలు గురించి వింటే మాత్రం మీరు తప్పకుండా షాక్ అవుతారు.

ఒక్కసారి ఈ జైలుకు వెళితే మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది మీకు.ఆ జైలు స్పెషాలిటీ అలాంటిది మరి.ఇంతకీ ఆ జైలు ఎక్కడ ఉందో తెలుసుకుందామా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం అయిన విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఈ జైల్ ఉంటుంది.

ఏంటి అక్కడ జైలు ఎక్కడ ఉంది.ఎప్పుడు కూడా వినలేదు అని అనుకుంటున్నారా.

నిజానికి అది ఖైదీలను బంధిచే నిజమైన జైలు కాదండోయ్.ఫుడ్ లవర్స్ ను తమ అమోఘమైన వంటకాలతో బధించే ఒక రెస్టారెంట్ అన్నమాట.

అచ్చం జైలు వాతావరణంలాగా ఉంటుంది ఈ హోటల్.అక్కడకు వెళ్లి జైల్లో కూర్చుంటే ఖైదీల డ్రెస్ వేసుకుని అచ్చం ఖైదీల మాదిరిగా ఉండే వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు.

లోపలికి రమ్మని ఖైదీలే వెల్కమ్ చెబుతారు.అచ్చం మన సెంట్రల్‌ జైలు ఎలా ఉంటుందో అలానే ఈ హోటల్ రూపొందించారు.

ఎందుకంటే ఈ కాలంలో ఆహార ప్రియులు వింత వింత వంటకాలను వెరైటీ అనుభూతులను కోరుకుంటున్నారు కావున.కాస్త కొతతనం కోసం ఇలా జైలు వాతావరణంను పోలిన రెస్టారెంట్ ను రూపొందించారు.

నిజంగా ఈ జైల్ థీమ్ కాన్సెప్ట్ అనేది అందరిని బాగా ఆకర్షిస్తుంది.ఈ జైలులో కూర్చుని రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ను ఇష్టం వచ్చినట్టు లాగించేయొచ్చు సూప్స్‌, స్టార్టర్స్‌ దగ్గర నుండి.

అన్ని రకాల బిర్యానీ వంటకాలు, బిర్యాని మండి, ఫ్యామిలీ ప్యాక్స్‌, జంబో బిర్యానీ, బేవరేజెస్‌ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి.

Telugu Biryani, Jail, Jail Restaurant, Jailthemed, Lovers, Jain, Mandi, Vijayawa

ఏడు నెలల క్రితం ప్రారంభించిన ఈ ఫుడ్ జైల్ రెస్టారెంట్‌కు ప్రజల దగ్గర నుండి విశేష ఆదరణ లభిస్తుందని హోటల్ నిర్వాహకులు అయిన శ్రీనివాస్ తెలిపారు.అలాగే నగర వాసులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎక్కడకి వచ్చి జైలు వాతవరణాన్ని ఎంజాయ్‌ చేస్తూన్నారని తెలిపారు.మరి ఈ ఫుడ్ జైలులో విందు అరగించాలంటే మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11.30 సమయంలో మాత్రమే వెళ్ళాలి.ఇక విజయవాడలో ఈ ఫుడ్ జైలు అడ్రెస్స్ ఎక్కడంటే E3 ఫుడ్‌కోర్టు, PNBS ఎదురుగా, ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌, కృష్ణలంక లొకేషన్ లో ఈ ఫుడ్ జైలు కలదు.

విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కు అతి దగ్గరలోనే ఈ రెస్టారెంట్‌ కలదు.మరి మీరు కూడా ఈ వీకెండ్ ను ఒకసారి జైలులో ప్లాన్ చేసుకుని జైలు వాతావరణాన్ని ఆస్వాదించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube