పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్యతో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.సిద్ధూ మరణించి రోజులు గడుస్తున్నా ఫ్యాన్స్ మాత్రం షాక్ నుంచి తేరుకోలేదు.
ఆయన పాటలను, మాటలను, ఫోటోలను షేర్ చేస్తూనే వున్నారు.జూన్ 11న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్వ్కేర్‌లోని స్క్రీన్‌పై సిద్ధూ మూసేవాలా పాటలను ప్లే చేసి ఆయనకు నివాళుర్పించారు.
తాజాగా కొరియాకు చెందిన జోంగ్ సూ అనే అభిమాని సిద్ధూపై అభిమానాన్ని చాటుకున్నారు.
ఆ వ్యక్తి .సిద్ధూ పాపులర్ ట్రాక్ ‘‘295’’ను పర్ఫెక్ట్ పిచ్‌తో పాడాడు.ఇందుకు సంబంధించిన వీడియోను తన @mylovefromkorea17 పోస్ట్ చేశాడు.
దీనికి “హ్యాపీ బర్త్‌డే లెజెండ్ @sidhu_moosewala#295@js_lee1990” అని క్యాప్షన్ పెట్టాడు.ఇది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.
భారతీయుడు కాకపోయినా సిద్ధూ మూసేవాలాపై తన ప్రేమను చూపిన జోంగ్ సూను పలువురు అభినందిస్తున్నారు.

కాగా.సిద్ధూ మూసేవాలా పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 11న ఆయన అభిమానులు ఘన నివాళులర్పించారు.అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.#Justice for Sidhu Moosewala అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియోలు షేర్ అవుతున్నాయి.
మూసేవాలా పుట్టినరోజు సందర్భంగా సింగర్, నటుడు అమ్మీ విర్క్ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా సిద్దూతో వున్న ఫోటోను విర్క్ షేర్ చేశారు.
“Veeere yar nai samjh aaa rea ki likhaaan… ajj de din jammeya c bhalwaan.” అంటూ రాసుకొచ్చారు.






