రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేం.ఎక్కడో స్విచ్ వేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది.
అలాగే రాజకీయ నేతల నోట్లో నుంచి వచ్చే మాట పార్టీకి పాజిటివ్ అవుతుందో.నెగిటివ్ అవుతుందో కూడా ఊహించలేం.
ఒక్కోసారి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ క్రమపద్దతిలో రెడ్ల సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తగ్గించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసేవాళ్లు.
దీంతో పదవుల పంపకం విషయంలోనూ వారికి ప్రాధాన్యత లభించేది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాధాన్యత తగ్గటాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు తట్టుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమకు విలువ ఇవ్వకపోవడాన్ని రెడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణలో కుల రాజకీయాలు తక్కువ అనే చెప్పాలి.
కానీ ఇటీవల అనూహ్యంగా రెడ్ల గురించి చాలా చర్చ జరిగింది.ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం రెడ్డి సామాజిక వర్గానికి ఊరట ఇచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు.
తమకో సమర్థుడైన నాయకుడు దొరికాడన్న సంతోషాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో ఇంతకాలం తమకు నాయకుడు లేడన్న లోటును రేవంత్ తీర్చటంతో పాటు భవిష్యత్తు మీద కొత్త ఆశలు కల్పించారని ముచ్చట పడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు సమయం చూసుకుని కారు నుంచి దిగిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ మార్పును గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ప్లాన్ వేశారు.రానున్న ఎన్నికల్లో రెడ్లకు అధిక ప్రాధాన్యత కల్పించేలా ఆయన వ్యూహరచన చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
దీంతో టీఆర్ఎస్‌లో ఉన్న రెడ్డి నేతలంతా రేవంత్‌కు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట.







