సేవా – సుపరిపాలన – గారిబీ కళ్యాణ్ బహిరంగ సభ తెరాస పార్టీ ఒక దండుపాళ్యం గ్యాంగ్ అని బండి సంజయ్ కామెంట్.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారాన్ని చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా మేడ్చెల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి అధ్యక్షతన జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కూరగాయల మార్కెట్ ప్రక్కన గల గ్రౌండ్ లో సోమవారం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిధిగా హాజరైనారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ 8 ఏండ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో
ప్రజా సంక్షేమ పాలన సేవా – గరీబీ కళ్యాణ్ – సుపరిపాలన ద్వారా సబకా సాత్,సబ్ కా వికాస్ నినాదం తో ప్రజలకు సేవ చేస్తున్న నిజమైన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తెరాస పాలనలో నీతి లేని పాలన కోనసాగుతుంది అని.కేంద్ర పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకుంటున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.అభివృద్ధిపై తెరాస ప్రజాప్రతినిధులను గళ్ళ పట్టి నిలదీయాలని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతుల నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని, తెరాస పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టుల చేపిస్తున్న కెసిఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ, తెరాస పార్టీ ఒక దండుపాళ్యం గ్యాంగ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బహిరంగ సభను విజయవంతం చేసిన జవహర్ నగర్ బిజెపి పార్టీ అధ్యక్షుడు రంగుల శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర , జిల్లా నాయకులు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ తో పాటు పార్టీ కార్యకర్తలు వివిధ డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.