టాలీవుడ్ హీరో రానా తాజాగా కమర్షియల్ హీరో అంటే ఏమిటి? కమర్షియల్ హీరోయిజం అంటే ఏమిటి అన్న విషయాలపై స్పందించాడు.ప్రస్తుత రోజుల్లో అయితే ఏ హీరోకీ అయితే ప్రేక్షకులలో భారీగా ఆదరణ దక్కుతుందో ఆ హీరో కమర్షియల్ హీరో అని,బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు సంపాదించుకునే హీరోయిజాన్ని కమర్షియల్ హీరోయిజం అని అంటున్నారు.
మరి ఈ విషయాల గురించి రానా ఏమి చెబుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సందర్భంగా ఈ విషయంపై రానా మాట్లాడుతూ.
తనవరకు కమర్షియల్ హీరోగా సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, తాను హీరోగా నటిస్తే నాకు సరిపడే విలన్ దొరకవు అని నాతో ఫైట్ చేసే విధానం నాకంటే తక్కువ ఎత్తు ఉంటారు అని తెలిపారు రానా.అదే విధంగా తనకు కథలు చెప్పాలని ఆలోచన ఉంది కానీ హీరోగా కథలు చెప్పాలని ఆలోచన మాత్రం లేదు అని ఆయన తెలిపారు.
అదే విధంగా తనకు కమర్షియల్ హీరోగా కావాలని కూడా లేదని తెలిపారు.

రొటీన్ సినిమా కథలు కూడా నచ్చవని, అలా అని హింస ఉండే కథలు కూడా నచ్చవని, కథా కథనంలో కొత్తదనం ఉండాలి అని చెప్పుకొచ్చాడు రానా.హిరణ్యకసిపుడు సినిమా అలాంటి దేనని అది తన కమర్షియల్ సినిమా అని అందులో రావణాసురుడు పాత్ర వేస్తే అది తనకు కమర్షియల్ సినిమా అని తాను భావిస్తాను అని చెప్పుకొచ్చారు రానా.రానా ఈ కథను మాత్రమే చేయగలడు అంటే అది నా జోనర్.
నెగిటివ్ షేడ్స్ ఉండే ఎమోషనల్ పాత్రలు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏ పాత్రలో నటించినా హీరోలా అనిపిస్తే అది తనకు కమర్షియల్ సినిమా అని చెప్పుకొచ్చాడు దగ్గుబాటి రానా.







