మీరు నెలకు ఎంత సంపాదిస్తారు? మీ ట్రిప్ కు ఖర్చు ఎంత అయ్యింది.. ఈ ప్రశ్నలకు యాంకర్ రవి సమాధానం?

టాలీవుడ్ బుల్లితెర పై తన యాంకరింగ్ తో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు యాంకర్ రవి. అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

 Anchor Ravi Strong Reply To Netizen About Remuneration,anchor Ravi, Nithya Saena-TeluguStop.com

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటుడుగా పరిచయమయ్యాడు.తొలిసారిగా సంథింగ్ స్పెషల్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇక ఈ షోలో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం అందుకున్నాడు.

ఇక ఈ షోలో యాంకర్ రవి కాస్త నెగిటివిటీ ని కూడా సంపాదించుకున్నాడు.హౌస్ లో ఉన్నంతకాలం బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.చాలా వరకు యాంకర్ రవి టైటిల్ విన్నర్ గా గెలుస్తాడని అనుకున్నారు.కానీ టాప్ ఫైవ్ లో కూడా ఉండలేకపోయాడు.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక రవి చేసిన హంగామా అందరికీ తెలిసిందే.తనపై ట్రోల్స్, మీమ్స్, కామెంట్లు చేసిన వారిపై దగ్గరుండి చర్యలు తీసుకున్నాడు.

ఏకంగా పోలీసు వాళ్లకు చెప్పి మరి రచ్చ చేశాడు.తన పైన కాకుండా తన భార్య పిల్లలపై కూడా కామెంట్లు చేశారని కోపంతో రగిలిపోయాడు.

తన భార్య నిత్య కూడా తమపై నెగటివ్ కామెంట్లు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.నిజానికి యాంకర్ రవి మొదట్లో తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని బయట పెట్టలేదు.

Telugu Anchor Ravi, Netizens, Nithya Saena, Ravi Interview, Telugu, Tollywood-Mo

ఆ తర్వాత కొంత కాలానికి తనకు పెళ్లి జరిగిందని, వియా అనే పాప కూడా ఉందని చెప్పాడు.వారిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.వాళ్ళు కూడా బుల్లితెరపై పలు షోలలో వచ్చి బాగా సందడి చేశారు. రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తన భార్య, బిడ్డ రాగా ఆ ఎపిసోడ్ మాత్రం బాగా హైలెట్ గా మారింది.

రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా మారాడు.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు.పైగా తన కూతురుతో చేసిన అల్లర్ల వీడియోలు కూడా పంచుకుంటాడు.ఇదిలావుంటే ఇటీవల ఆయన తన ఫ్యామిలీతో టూర్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇక దాంతో ఆయన తాజాగా సరదాగా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించాడు.

Telugu Anchor Ravi, Netizens, Nithya Saena, Ravi Interview, Telugu, Tollywood-Mo

అందులో నెటిజన్లు ఈ ట్రిప్ కి ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు అని అడగటంతో డాలర్స్ లో చెప్పాలా లేదా రూపీస్ లో చెప్పాలా అని ప్రశ్నించాడు.అంతేకాకుండా మీరు నెలకు ఎంత సంపాదిస్తారు అని అడగటంతో.అది ఆవరేజ్ బయ్యా అని సమాధానమిచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube