గూగుల్ క్రోమ్, Mozilla వాడేవారికి ప్రభుత్వం అలర్ట్

ఇంటర్నెట్ వాడే ప్రతిఒక్కరికీ తెలిసిన బౌజర్లు గూగుల్ క్రోమ్, మొజాల్లా. ఇంటర్నెట్ వినియోగించే ప్రతిఒక్కరూ వీటిని వినియోగిస్తూ ఉంటారు.

 Indian Government Alert For Google Chrome Mozilla Firefox Users-TeluguStop.com

ఆన్ లైన్ లో ఏ పనికోసమైనా సరే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.అయితే వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఏవి పడితే అవి సెర్చ్ చేయడం, అసాంఘిక వెబ్ సైట్లు ఓపెన్ చేయడం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశముంది.అందుకే సేఫ్ బ్రౌజింగ్ మాత్రమే చెయ్యాలి.

తెలియని వెబ్ సైట్లలోకి ఎంటర్ కాకూడదు.

ఈ క్రమంలో తాజాగా భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్, మొజల్లా సర్వీసుల్లో కొన్ని లోపాలను గుర్తించి బయటపెట్టింది.

వీటిల్లో ఉన్న ఈ లోపాల వల్ల హ్యాకర్ల బెడద ఉండే అవకాశముందని, వినియోగదారుల సమాచారాన్ని హ్యాకర్లు హ్యాక్ చేసి తస్కరించే అవకాశముందని స్పష్టం చేసింది.వీటిల్లో సెక్యూరిటీ మెకానిజంను దాటి ఆర్బిటరీ కోడ్స్ ను ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ సర్వీస్ టీమ్ గుర్తించింది.

96.0.4664.209కి ముందున్న గూగుల్ క్రోమ్ OS వెర్షన్లకు ఇంకా హైరిస్క్ ఉందని తెలిపింది.ఈ క్రమంలో గూగుల్ సంస్థ క్రోమ్ వినియోగదారులకు కీలక సూచనలు జారీ చేసింది.

Telugu Google Chrome, Hackers, Indian, Mozilla, Mozilla Firefox, Orbitary Codes,

అన్ని బగ్ లను గుర్తించామని, క్రోమ్ తాజా వెర్షన్లను డౌన్ లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.అలాగే mozilla firefox ios 101, mozilla firefox thunderbird 91.10, mozilla firefox esr 91.10లను డౌన్ లోడ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

వీటిల్లో ఉన్న లోపాల వల్ల టార్గెటెడ్ సిస్టమ్ లలో హ్యాకర్లు డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులు చేస్తున్నారని, ఈ మెయిల్, వెబ్ సైట్ లు, ఆన్ లైన్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం సంస్థ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube