1.డిఆర్ డివో హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న హైదరాబాదులోని రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
2.రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మీడియా సమావేశాలు
కాంగ్రెస్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది.ఈ మేరకు ఆ పార్టీ శనివారం ప్రకటన చేసింది.
3.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.ఈ నెల 25న వైసీపీ మెగా జాబ్ మేళా
నిరుద్యోగుల కోసం వైయస్సార్సీపి జాబ్ మేళా ను నిర్వహిస్తోంది ఈ నెల 25న వైఎస్ఆర్ కడప జిల్లా, చాపాడు మండలం లోని సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
5.ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
6.టీటీడీ జేష్ఠభిషేకం టికెట్లు విడుదల
ఈ రోజు తిరుమల లో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు.
7.గుంటూరు తెనాలి ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రవీణ్ పవార్ నేడు గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
8.స్విమ్స్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం
నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ( స్విమ్స్ ) యూనివర్సిటీ పదకొండవ స్నాతకోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ , రైమ్స్ చాన్స్ లర్ వి సుబ్బారెడ్డి , ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పాల్గొననున్నారు.
9.గుంటూరులో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ
నేడు గుంటూరులో కళా దర్బార్ ఆధ్వర్యంలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగనుంది.ఈ కార్యక్రమంలో ఎస్.పి.శైలజ పాల్గొననున్నారు.
10.పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి ముఖ పక్షవాతం
ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతం తో బాధపడుతున్నారు.ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
11.అమెరికాలో శ్రీవారి కల్యాణోత్సవం
జూన్ 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో స్వామి వారి కళ్యాణాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
12.పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర
అక్టోబర్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
13.ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్
ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
14.తెలంగాణలో కరోనా
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.తెలంగాణలో గడచిన 24 గంటల్లో 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ
గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు.
16.కెసిఆర్ పై తరుణ్ ఛుగ్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని పగటికలలు కంటున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు.
17.సత్యం రామలింగరాజు తల్లికి హైకోర్టులో ఊరట
సత్యం రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ కు హైకోర్టులో ఊరట లభించింది.కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సీ తదితర బ్యాంకులో ఆమెకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను , బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
18.ఆలస్యంగా వస్తే టెట్ అభ్యర్థులకు నో ఎంట్రీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.రేపు ఈ పరీక్ష జరగనుంది .ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.
19.ఈ నెల 13 నుంచి ప్రాజెక్టుల సందర్శనకు గోదావరి బోర్డు
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి బేసిన్ లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను గోదావరి నది యాజమాన్య బోర్డు సందర్శించనుంది.
20.బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ గడువు పెంపు
వికలాంగుల కోటాలో ని బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ గడువును 2024 మార్చి 31 దాకా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.