టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చాలానే ఉన్నాయి.ఇవన్నీ కూడా వందల కోట్ల పెట్టుబడులతో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.
అయితే కరోనా అందరి జీవితాలను మార్చేసింది.ఈ ప్యాండమిక్ వచ్చిన తర్వాత సినిమాల మేకింగ్ లు నిలిచి పోయాయి.
ఇలా నిలిచి పోవడంతో కొత్త సినిమాల నిర్మాణానికి చాలా ప్రొడక్షన్ కంపెనీలు బయపడి వెనకడుగు వేసాయి.
కోట్లు పెట్టుబడి పెడితే వడ్డీలు కట్టాలి.
అలా చేస్తే నిర్మాతలకు అప్పులు బాధలు ఎదురవుతాయి.అయితే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు మాత్రం భయపడకుండా ముందడుగు వేసాయి.
వరుసగా భారీ సినిమాలు నిర్మిస్తూ తమ హవా కొనసాగిస్తున్నాయి.అయితే ఒక ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.2015లో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఆ సంస్థ ఇప్పుడు తలపట్టుకున్నట్టు తెలుస్తుంది.
గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సంస్థ ఆ తర్వాత స్టార్ హీరోతో వందల కోట్లతో మూవీ స్టార్ట్ చేసింది.
ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి.స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఎడాపెడా సినిమాలు స్టార్ట్ చేసి సెట్స్ మీదకు తీసుకు వెళ్లాయి.
ఈ సినిమాలన్నీటికీ భారీ మొత్తం పెట్టడంతో ఈ సంస్థ ఊబిలోకి కూరుకు పోయిందట.

దీని నుండి బయటకు రావాలంటే సెట్స్ మీద ఉన్న అన్ని సినిమాలు రిలీజ్ కావాల్సిందే.ఈ 10 ప్రాజెక్టులలో ఇప్పటికే రెండు రిలీజ్ అవ్వగా మరొక 8 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.ఈ ప్రొడక్షన్ సంస్థ ఈ మొత్తం సినిమాలకు గాను దాదాపు 1000 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది.
ఇప్పటికి సినిమాలు పూర్తి కాకా పోవడం పెట్టిన పెట్టుబడి అంతా అలాగే ఉండడంతో వీరికి రొటేషన్ అవ్వక తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సంస్థ ఈ ఊబిలో నుండి ఎలా బయట పడుతుందో అని అంతా చర్చించు కుంటున్నారు.







