ఇప్పుడు ఏపీలో గ్రామాల్లో, పట్టణాల్లో, రోడ్లపై ఇలా ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల నాయకుల హడావుడి కనిపిస్తోంది.ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అధికార పార్టీ వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి, ఇలా ప్రధాన పార్టీలన్నీ అప్పుడే జనాలను ప్రసన్నం చేసుకుని ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.అధికార పార్టీ వైసిపి ఇప్పటి వరకు తాము ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసాము .? రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి అమలు చేస్తాము ? తమ పథకాల వల్ల ఏ కుటుంబానికి ఎంతమేర లబ్ధి చేకూరింది ఇలా అనేక అంశాలతో ప్రజల్లోకి వెళ్తోంది.గడపగడపకు ప్రభుత్వం పేరుతో పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేస్తూ జనాల్లో పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
రాబోయే ఎనిమిది నెలల వరకు జనాల్లోనే పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉండాలని వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.ఇక ఏపీ సీఎం జగన్ సైతం జిల్లా పర్యటనలు చేస్తూ.
ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందనే విషయాన్ని చెబుతూనే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రజల నాడిని గుర్తించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది.
ప్రధాన సమస్యలను హైలైట్ చేస్తూ.ఆ పార్టీ నాయకులు పోరాటాలు చేస్తున్నారు.
త్వరలోనే చంద్రబాబు, లోకేష్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈనెల 15వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించబోతున్నారు.

అక్టోబర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు .పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జిల్లాల యాత్ర చేపట్టారు.నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశం అవుతూ జనసేన కేడర్ లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక బిజెపి సైతం వరుసగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ జాతీయ నేతలందరినీ ఏపీలో పర్యటించేలా చేస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.
అప్పుడే ఎన్నికల వాతావరణం ఏపీలో కనిపిస్తోంది.







