నిన్న స్టార్ హీరో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయనే సంగతి తెలిసిందే.బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా అఖండను మించి ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
అయితే బాలయ్య రియల్ రాకీభాయ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య రియల్ లైఫ్ లో ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ మాస్ సినిమాలలో ఎక్కువగా నటించినా కథ నచ్చితే ఇతర జానర్లలో కూడా నటించడం గమనార్హం.2004 సంవత్సరం తర్వాత కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలతో బాలయ్య కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో బాలయ్య గురించి ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరగడం గమనార్హం.బాలయ్య బోయపాటి శ్రీనుకు అవకాశం ఇచ్చిన సమయంలో బోయపాటి శ్రీను కూడా బాలయ్యకు హిట్ ఇవ్వలేడని చాలామంది భావించారు.
అయితే సింహా సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
సోషల్ మీడియాలో తన గురించి మీమ్స్ వచ్చినా ఎవరైనా ట్రోల్స్ చేసినా బాలయ్య వాటి గురించి నెగిటివ్ గా రియాక్ట్ కావడానికి అస్సలు ఇష్టపడరు.సాధారణంగా ఆదిత్య 369 తరహా ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి స్టార్ హీరోలు ఇష్టపడరు.అయితే బాలయ్య మాత్రం కథకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ కెరీర్లో సక్సెస్ కావడానికి ఎంతగానో కృషి చేశారు.
బాలయ్య గురించి కరెక్ట్ గా అర్థం చేసుకోని వాళ్లకు భోళా శంకర్ సినిమా ద్వారా బాలయ్య అంటే ఏంటో క్లారిటీ వచ్చింది.బాలయ్య తను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారనే చెప్పాలి.బాలయ్య రియల్ రాకీభాయ్ అని రాకీభాయ్ లైఫ్ లో ఎలాంటి కష్టాలు ఉన్నాయని బాలయ్య లైఫ్ లో కూడా అలాంటి కష్టాలు ఎదురయ్యాయని అయితే నవ్వుతూ కెరీర్ లో అంతకంతకూ ఎదిగి బాలయ్య ఈ స్థాయికి చేరుకున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.