హిట్‌ డైరెక్టర్ కి సూపర్‌ స్టార్‌ నుండి పిలుపు.. చేద్దాం అన్నాడా?

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తాజాగా విక్రమ్‌ చిత్ర హీరో కమల్‌ హాసన్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ను అభినందించారు.రెగ్యులర్‌ గా ఎన్నో సినిమాలు వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి.

 Lokesh Kanagaraj Meets With Rajinikanth For New Film Lokesh Kanagaraj, Rajinika-TeluguStop.com

కాని వారెవ్వరిని కూడా ఇలా ఇన్వైట్‌ చేసి అభినందించిన దాఖలాలు లేవు.కాని ఎందుకు వీరినే స్వయంగా రజినీకాంత్ ఆహ్వానించాడు అంటూ మీడియా వర్గాల్లో కొంత మంది చర్చించుకుంటూ ఉన్నారు.

ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం లోకేష్ కనగరాజ్ మీద ఇప్పుడు అందరికి చాలా నమ్మకం ఉంది.కమల్‌ హాసన్‌ దశాబ్ద కాలంగా సక్సెస్ కోసం ప్రాకులాడుతూ ఉంటే ఇప్పటికి ఆ హిట్‌ దక్కింది.

మళ్లీ ఇప్పుడు అదే తరహా లో రజినీకాంత్‌ కు సక్సెస్ కావాలి.

చాలా ఏళ్లుగా రజనీకాంత్ కు సక్సెస్ లు లేవు.

దాంతో ఆయన ఢీలా పడి పోయాడు.ఆయన మళ్లీ పుంజుకోవాలంటే సినిమా హిట్‌ అవసరం.

ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాడు కాని కమర్షియల్‌ గా తన స్థాయికి తగ్గట్లుగా మాత్రం సక్సెస్‌ కాలేక పోతున్నాడు.అందుకే లోకేష్ కనగరాజ్ తో ఒక సినిమా చేసి సక్సెస్ కొడితే మళ్లీ కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్‌ హోదాతో గౌరవంగా కొనసాగ వచ్చు అనేది రజినీకాంత్‌ అభిప్రాయం.

అందుకే సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ప్రస్తుతం మెల్ల మెల్ల గా లోకేష్ కనగరాజ్ తో సినిమా ను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటున్నారు.అయితే ఇప్పటికే విజయ్‌ తో సినిమా కు లోకేష్‌ కమిట్‌ అయ్యాడు.

ఆ తర్వాత ఖైదీ సినిమా యొక్క సీక్వెల్‌ ను చేస్తున్నారు.ఆ తర్వాత కాని రజినీకాంత్‌ తో సినిమా ఉంటుందేమో చూడాలి.

రామ్‌ చరణ్ తో కూడా ఈ హిట్ చిత్రాల దర్శకుడు చర్చలు జరిపాడు అంటూ వార్తలు వచ్చాయి.అది ఎప్పటి వరకు వస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube