మంచు విష్ణు..
ఈయన గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడి పోతున్నాడు.మంచు కాంపౌండ్ సినిమాల పరంగా వెనకనే ఉన్నారు.
సినిమాలు చేస్తున్న సరైన సక్సెస్ అయితే రావడం లేదు.దీంతో ప్రేక్షకులు మంచు హీరోలను మర్చిపోతున్నారు.
మంచు విష్ణు చివరగా మోసగాళ్లు సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.అయితే ఈసారి అయినా ప్లాప్ కాకుండా విజయం అందుకోవాలని మంచు విష్ణు భావిస్తున్నాడు.
ఈ మేరకు విష్ణు ముందు నుండే తన #VM19 సినిమా కోసం భారీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నాడు.
ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటు మరొక హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి విష్ణు హీరోయిన్ లతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు.
ఎలా అయినా ఈ సినిమాను ప్రేక్షకుల నోళ్ళలో నాణేల చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇటీవలే ఈ హీరోయిన్ లతో కలిసి లంచ్ డేట్ కి వెళ్లి నెట్టింట రచ్చ రచ్చ చేసాడు.
ఇక తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ విషయంలో కూడా హీరోయిన్ లతో సోషల్ మీడియాలో సందడి చేసాడు. ఓయ్ గాలి నాగేశ్వరరావు.
.చాలా కాలంగా కనిపించలేదు.
అని సన్నీ లియోన్ ట్వీట్ చేయగా దీనికి పాయల్ ఇంకా ఎన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్ విష్ణు.అంటూ ట్వీట్ చేసింది.

వీరిద్దరికి ఆన్సర్ గా విష్ణు ఈ ఒక్క రోజు వెయిట్ చేయి స్వాతి..రేపు ఉదయం 9.32 గంటలకు అందరికి చెప్పేద్దాం.అంటూ టైటిల్ అప్డేట్ ను డిఫెరెంట్ గా ప్రొమోషన్ ప్లాన్ చేసాడు.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ ఈ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటెర్టాన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.







