జస్ట్ ఆర్టినర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’.ఈ సినిమా టైటిల్ లుక్‌ను టాలీవుడ్ హండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి విడుదల చేశారు.‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థలో మరో వెరైటీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది.
రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.కామెడీ, డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమేష్ రాపార్తి, నిర్మాతలు : మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి, సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు మ్యూజిక్: గుణ బాలసుబ్రమణియమ్, డైలాగ్స్: తిరుమల నాగ్, ఆర్ట్: పురుషోత్తమ్, బిక్షపతి, జె.కె.మూర్తి, ఎడిటర్: డి.వెంటక ప్రభు, నవ్ కట్స్ పాటలు: శ్రీమణి, కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, విజయ్ బిన్ని







