విరాటపర్వం మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమాలో అది అద్భుతం అంటూ?

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన విరాటపర్వం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 Virataparvam Movie First Review Details Here Goes Viral,virataparvam, Viratapar-TeluguStop.com

యంగ్ హీరో నిఖిల్ ఈ సినిమా చూసి ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు.విరాటపర్వం గురించి నిఖిల్ పాజిటివ్ గా రివ్యూ ఇవ్వడం గమనార్హం.

వేణు ఊడుగుల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా వరుసగా ఈ సినిమా నుంచి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.వాస్తవ సంఘటనల ఆధారంగా వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది.

నిఖిల్ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ విరాటపర్వం ఎపిక్ లవ్ స్టోరీ అని ఈ సినిమా నన్ను షాక్ కు గురి చేసిందని వెల్లడించడం గమనార్హం.

విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని సినిమాలో రానా దగ్గుబాటి నటన కూడా బాగుందని చెప్పుకొచ్చారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు వేణు ఊడుగులకు హ్యాట్సాఫ్ అంటూ నిఖిల్ చేసిన కామెంట్లు సినిమాపై అంచనాలను పెంచాయి.సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించారు.

సోలో హీరోగా విరాటపర్వం సక్సెస్ రానాకు కీలకమని చెప్పవచ్చు.

Telugu Review, Nikhil, Rana, Sai Pallavi, Virataparvam-Movie

సాయిపల్లవి ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నారు.సాయిపల్లవికి ఉన్న క్రేజ్ తో ఆమెకు సినిమా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రముఖ ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా మేకర్స్ మాత్రం థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయడం గమనార్హం.

విరాటపర్వం సినిమాలో ప్రేమకథ అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube