175 సీట్లు అంటూ జపం చేస్తున్న జగన్.. అంత సీనుందా?

ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్ 175 సీట్లు అంటూ జపం చేస్తున్నారు.రాజకీయాల్లో ఆశ ఉండాలి తప్పితే అత్యాశ పనికిరాదనే నానుడి ఉంది.

 Jagan Meeting With Key Leaders Of Ycp, Jagan Chanting 175 Seats Is That So. Andh-TeluguStop.com

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించేంత సీన్ ఉందా అంటే నిస్సందేహంగా లేదనే అందరూ స్పష్టం చేస్తున్నారు.అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలించినా ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉంటుంది.అలాంటిది ప్రజా ప్రభుత్వాల పాలన అంటే చాలా మైనస్సులు ఉంటాయి.

రాజకీయాల్లో అన్ని సీట్లూ మనకే దక్కాలి అనుకోవడం అత్యాశే అవుతుందే.ఏపీలో సీఎం జగన్ ఆలోచనలను చూస్తే మనం అన్ని హామీలు నెరవేర్చాం, సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నామని.

మనకంటే ఎవరూ దేశంలో ఇంతకంటే చేయబోరని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.జగన్ చెప్పిందే కరెక్ట్ అనుకున్నా సంక్షేమ పథకాలు అందరికీ అమలవుతున్నాయా అన్నదే ఇక్కడి ప్రశ్న.

అలా అని సంక్షేమ పథకాలు పొందిన వారంతా ఓటేస్తారు అనుకుంటే ఎపుడూ ఒకరే పాలకులుగా ఉంటారు.1983లో ఎన్టీఆర్ ఎన్నో పథకాలు మొదలుపెట్టారు.కానీ 1989 నాటికి ఆయన ఓడిపోయారు.స్వయంగా ఒక చోట ఎమ్మెల్యేగా కూడా ఓటమి చవిచూశారు.ఇప్పుడు వైసీపీ సర్కార్ విషయం తీసుకుంటే సంక్షేమం గురించే పట్టించుకుంటూ అభివృద్ధిని మరచిపోయిందన్న పెద్ద విమర్శ ఉంది.అది విమర్శ కూడా కాదు నిజం కూడా.

Telugu Andhra Pradesh, Ap, Cm Jagan, Ysrcp-Telugu Political News

ఏపీలో గత మూడేళ్ల పాలనను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రానికి రాజధాని లేదు.ఆలయాల మీద ఎన్నో దాడులు జరిగాయి.మహిళల మీద అఘాయిత్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

కరెంట్ కష్టాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.రోడ్లు నాసిరకంగా ఉన్నాయి.

ఈ విషయాన్ని అయితే పక్క రాష్ట్ర మంత్రి వర్యులు కూడా ప్రస్తావించారు.ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు.

పోలవరం అతీగతీ లేకుండా తయారైంది.పారిశ్రామికంగా రాష్ట్రం వెనకబడి ఉంది.

నిరుద్యోగులకు సరైన ఉపాధి లేదు.మరి ఇన్ని సమస్యలు ఉండి కూడా వైసీపీ 175 సీట్లు సాధిస్తుందని జగన్ ఎలా విశ్వసిస్తున్నారన్న విషయం అందరికీ విస్మయం కలిగించక మానదు.

ఇది కచ్చితంగా జగన్ ఓవర్ కాన్ఫిడెన్సేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube