NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఓ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.ఒకే క్రమంలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల మేర పొడవైన రోడ్డు నిర్మాణాన్ని కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసి, ఔరా అనిపించింది.
దీంతో ఇపుడు ఖతార్ పేరుతో ఉన్న రికార్డుని ఇండియా బద్దలు కొట్టింది.ఈ నేపథ్యంలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు.మహారాష్ట్రలోని “అమరావతి నుంచి అకోలా” వరకు ఈ జాతీయ రహదారి 53పై రోడ్డు నిర్మాణ పనులను NHAI గత శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి.
మంగళవారం నాడు పూర్తి చేసింది.
మొత్తం 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును కేవలం 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం.
దీంతో అతి తక్కువ సమయంలో 75 కి.మీ.రోడ్డు పూర్తిచేసి గిన్నిస్ రికార్డులకెక్కింది.దీనిని గుర్తించి గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ కూడా అందజేయడం విశేషం.ఇప్పటివరకు ఈ రికార్డు ఖతార్‌కు చెందిన పబ్లిక్ వర్క్స్ అథారిటీ ASHDHAL Public Works Authority పేరుపై ఉన్నది.2019, ఫిబ్రవరి 17న అల్-ఖర్ ఎక్స్‌ప్రెస్‌వే పై 75 కి.మీ.రోడ్డును ASHDHAL నిర్మించింది.అయితే దీనికోసం వారు 10 రోజుల సమయం తీసుకున్నారు.కాగా ఇపుడు ఆ రికార్డుని భారత్ తిరగరాసింది.

NHAIకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి భారత్ కి ఈ ఖ్యాతిని తీసుకురావడంలో కీలక పాత్రను పోషించారు.జూన్ 3వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా.జూన్ 7 సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.







