కార్తీకదీపం రీ ఎంట్రీ పై స్పందించిన డాక్టర్ బాబు.. ఏమన్నారంటే?

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు.

 Dr Babu Responding To Karthikadeepamre Entry Do You What Hesay ,karthika Deepam,-TeluguStop.com

ఈ సీరియల్లో ఇతని పేరు కన్నా డాక్టర్ బాబుగా అందరికీ గుర్తుండిపోయారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సీరియల్ కి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే డాక్టర్ బాబు వంటలక్క లేని లోటు సీరియల్ లో బాగా కనబడుతోందని వీరి రాక కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి.</br<

ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ లో కి డాక్టర్ బాబు ఎంట్రీ ఇస్తారంట చాలామంది పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సీరియల్ కు దూరమైన డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కాంటెస్ట్ పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఎంతో మంది నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలడుగుతూ సమాధానాలు రాబట్టారు.

Telugu Karthik, Karthika Deepam, Vantalakka-Movie

ముఖ్యంగా చాలా మంది నిరుపమ్ ను ప్రశ్నిస్తూ మీ తదుపరి సీరియల్స్ ఏంటి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? తిరిగి కార్తీకదీపం రీఎంట్రీ ఉంటుందా? అంటూ పలు ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నలకు డాక్టర్ బాబు సమాధానం చెబుతూ ప్రస్తుతం సీరియల్స్ ఆలోచన అయితే లేదని చెప్పారు.కానీ తాను ఒక సీరియల్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఒక వెబ్ సిరీస్ కూడా చేశానని త్వరలోనే ఆ వెబ్ సిరీస్ గురించి అధికారికంగా ప్రకటిస్తారని తెలియజేశారు.ఇక కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ తను ఆ సీరియల్ లోకి తిరిగి వచ్చే ఛాన్సే లేదని ఇప్పుడు సీరియల్ లోకి వచ్చి అంత పెద్ద పిల్లల చేత డాడీ అనిపించుకోలేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube