నల్గొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేట్ పొదుపు సంఘాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది.స్నేహ సమాఖ్య అప్పు విముక్తి పొదుపు సంఘం పేరుతో పట్టణంలోని మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి 100 మంది బాధితుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూల్ చేసి సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న సంస్థ నిర్వాహకులపై అనుమానం వచ్చిన బాధితులు బుధవారం పట్టణంలోని ఈదులగూడా కార్యాలయానికి తాళంవేసి ఆందోళన చేపట్టారు.అనంతరం సంస్థ నిర్వాహకులైన కృష్ణవేణి,భిక్షం,శంకర్ లపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేశారు.
Latest Nalgonda News