బాలయ్య 107 ట్రీట్ ఏంటో తెలుసా.. మాస్ ప్రేక్షకులు గెట్ రెడీ..

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.చాలా రోజుల తర్వాత విజయం అందిన ఉత్సాహంతో బాలయ్య తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.

 Nandamuri Balakrishna Gopichand Malineni Nbk107 Solid Treat Details, Nbk107, Nan-TeluguStop.com

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ త్వరలోనే పుట్టిన రోజు జరుపు కోనున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న 107వ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా చేస్తున్నాడు.గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా మనం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.ఈ సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ సమీపంలో షూటింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.బాలయ్య తన పుట్టిన రోజును జూన్ 10న జరుపు కోనున్నారు.

Telugu Balakrishna, Duniya Vijay, Nbk, Shruthi Hasan-Movie

ఈ క్రమంలోనే మేకర్స్ బాలయ్య పుట్టిన రోజు కానుకగా అదిరిపోయే అప్డేట్ ను వదులుతున్నారని అధికారికంగా ప్రకటించారు.మరి ఆ సాలిడ్ అప్డేట్ ఏంటో తెలియక నిన్నటి నుండి ఫ్యాన్స్ అంతా ఆరా తీస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఆయన పుట్టిన రోజు కానుకగా ఏ అప్డేట్ ఇస్తున్నారో అనేది కొద్దిగా రివీల్ అయ్యింది.

Telugu Balakrishna, Duniya Vijay, Nbk, Shruthi Hasan-Movie

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి బాలయ్య పుట్టిన రోజు కానుకగా అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో కూడిన 35 సెకండ్స్ పాటు ఉన్న వీడియోను వదులుతున్నట్టు టాక్ గట్టిగ వినిపిస్తుంది.ఈసారి కూడా థమన్ బీజీఎమ్ బాలయ్య సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టాక్.మరి మాస్ ప్రేక్షకులు ఇందుకు సిద్ధం అవ్వడం మంచిది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube