ప్రస్తుతం సొంత సినిమాలు కాకుండా రీమేక్ సినిమాలు బాగా వస్తున్నాయి.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలైన సినిమాలకు రీమేక్ చేస్తూ మంచి సక్సెస్ లు అందుకున్నారు.
కేవలం ఇప్పుడే కాకుండా అప్పట్లో కూడా చాలా వరకు చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి.ఇక అందులో బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి.
ఇంతకూ అవేంటో తెలుసుకుందాం.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ వయసులో కూడా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇక ఈయన రీమేక్ సినిమాల్లో కూడా బాగా నటించాడు.
ఇంతకూ అవేంటంటే.నర్తనశాల.
కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కగా.ఈ సినిమా తన తండ్రి ఎన్టీరామారావు నటించిన సినిమా నుండి తీసుకున్నారు.
హాలీవుడ్లో తెరకెక్కిన టోటల్ రీకాల్ సినిమాను రీమేక్ చేయగా తెలుగులో లయన్ అనే పేరుతో తెరకెక్కించారు.

ఇక ఎన్టీఆర్ నటించిన పాండురంగడు సినిమా పాండు రంగడుగా రీమేక్ చేశారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా సీక్వెల్ ను ఒక్క మగాడుగా రూపొందించారు.హాలీవుడ్లో తెరకెక్కిన ది బౌర్నే ఐడెంటిటీ సినిమాను, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను తీసుకొని విజయేంద్ర వర్మ గా తెరకెక్కించారు.

తమిళంలో తెరకెక్కిన సామి సినిమా రీమేక్ ను లక్ష్మీ నరసింహగా తెరకెక్కించారు.కన్నడంలో తెరకెక్కిన రాజనర్సింహ సినిమా రీమేక్ కు పలనాటి బ్రహ్మనాయుడుగా తెరకెక్కించారు.బాలీవుడ్లో తెరకెక్కిన హీరో నెంబర్ వన్ సినిమా గొప్పింటి అల్లుడు గా తెరకెక్కించారు.ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ కృష్ణార్జున విజయం గా రూపొందించారు.

ఇక ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, గులేబకావళి కథ, జగదేకవీరుని కథ, రాజపుత్ర రహస్యం అంటే నాలుగు సినిమాలను తీసుకొని భైరవ ద్వీపంగా తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు.ఎన్టీఆర్ నటించిన సత్యహరిచంద్ర, శకుంతల సినిమాలను కలిపి బ్రహ్మర్షి విశ్వామిత్ర గా రీమేక్ చేశారు.తమిళ సినిమా తంగమన రాసా సినిమాను కోడి రామకృష్ణ ముద్దుల మేనల్లుడు సినిమాగా తెరకెక్కించాడు.

మలయాళంలో సూపర్ హిట్ ఆర్యన్ సినిమాకు అశోక చక్రవర్తి సినిమాను రీమేక్ చేశారు.ఇక తమిళంలో విడుదలైన ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాకు ముద్దుల మావయ్య సినిమాగా రీమేక్ గా తెరకెక్కించారు.రాముడు భీముడు సినిమా కూడా రీమేక్ సినిమానే.
ఇక మువ్వగోపాలుడు సినిమాను తమిళ సినిమా నుండి రీమేక్ గా తెరకెక్కించారు.

రాము సినిమాను కూడా తమిళ సినిమా నుంచి రీమేక్ చేశారు.నిప్పులాంటి మనిషి సినిమా బాలీవుడ్ సినిమా నుండి రీమేక్ చేశారు.అబ్బాయ్ అబ్బాయ్ సినిమాను ఎన్టీఆర్ సినిమా నుండి రీమేక్ గా తెరకెక్కించారు.
ఆత్మబలం, మంగమ్మగారి మనవడు, డిస్కో కింగ్, అనురాగ దేవత, శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీమద్విరాటపర్వం, అక్బర్ సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం వంటి సినిమాలన్నీ ఇతర భాషలతో పాటు తెలుగు సినిమాల రీమేక్ గా తెరకెక్కించారు.







