తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక టిఆర్పి రేటింగ్స్ అందుకుంటున్న షోలతో పోల్చుకుంటే జబర్దస్త్ టాప్ లిస్ట్ లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటకె ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయమైన విషయం తెలిసిందే.ఇంకా కొత్త కొత్త వారు తమ తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.
అయితే మొదటి నుంచి ఈ షోపై పాజిటివ్ గా వార్తలు వినిపించగా రాను రాను ఈ మధ్య కాలంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.షోలో బూతుల పేరుతో కామెడీ చేయడం కూడా జనాలకు ఎబ్బెట్టుగా అనిపించింది.
కొద్దిరోజుల పాటు జబర్దస్త్ షోలో బూతు డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులతో స్కిట్స్ చేసారు.అయితే ఇటీవల కాలంలో మాత్రం అడల్ట్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోయింది.
అయితే గతంలో వచ్చిన టిఆర్పి రికార్డులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూనే వచ్చింది.కానీ గత రెండు మూడేళ్ళుగా మాత్రం రేటింగ్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి.
కమెడియన్స్ పారితోషికాలు కూడా తగ్గాయి.సీనియర్ కమెడియన్స్ అందరు జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళిపోతున్నారు.
దీంతో కొత్త కొత్త వారు ఎంట్రీ ఇస్తుండడం, అలాగే స్కిట్ లలో కూడా పెద్దగా కామెడీ లేకపోవడంతో జబర్దస్త్ షో ని చూసేందుకు జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

అంతేకాకుండా జబర్దస్త్ కొత్త లో కూడా చాలా అడల్ట్ కంటెంట్ వచ్చింది.బూతులు కూడా ఎక్కువైపోతున్న ట్లుగా విమర్శలు కూడా వచ్చాయి.అలాగే కొన్నిసార్లు జబర్దస్త్ కమెడియన్స్ పై దాడులు కూడా జరిగిన విషయం తెలిసిందే.
అయితే జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు తగ్గిపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు జబర్దస్త్ అదిరే అభి. స్కిట్ లలో డబల్ మీనింగ్ డైలాగ్స్ అలాగే బూతులు కూడా ఎక్కువగా ఉండకూడదని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందట.అలాగే కమెడియన్స్ కూడా ఎక్కువగా అలాంటి కంటెంట్ పై ఆలోచించకుండా భిన్నమైన కామెడీ తో ఆకట్టుకోవాలని డిసైడ్ అయినట్లు అభి తెలిపాడు.జబర్దస్త్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు చాలావరకు జబర్దస్త్ లో అడల్ట్ కంటెంట్ తగ్గిపోయింది అని కమెడియన్ అదిరే అభి చెప్పుకొచ్చాడు.







