పొలిటికల్ కామెడీ : పవన్ కు వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్ !

ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ ఏం మాట్లాడినా.ఎంత సీరియస్ వ్యాఖ్యలు చేసినా.

 Ka Paul Offer On Janasena Cheif Pavan Kalyan, Janasena, Pavan Kalyan, Janasenani-TeluguStop.com

అది పొలిటికల్ కామెడీగానే అంతా భావిస్తూ ఉంటారు .దీనికి తగ్గట్లుగానే ఆయన మాటలు కూడా ఉంటాయి.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల పై ఫోకస్ పెట్టిన ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ముందుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రజాశాంతి పార్టీ లో చేరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన ఓ భారీ ఆఫర్ ను ప్రకటించారు.

పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీ లో చేరితే ఎమ్మెల్యే గానో,  ఎంపీ గానో గెలిపిస్తానని అలా గెలిపించలేకపోతే వెయ్యి కోట్లు ఇస్తాను అంటూ ఆఫర్ ప్రకటించారు.

అంతేకాదు ఈ సందర్భంగా పవన్ పైన విమర్శలు చేశారు.

పవన్ సొంతంగా పోటీ చేసినా, మరే పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవలేరు అంటూ జోస్యం చెప్పారు.పవన్ బీజేపీతో పొత్తు లో ఉండి బైబిల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.42 ఎంపీ సీట్ల తో గెలుస్తామని, హైదరాబాద్ తప్ప అన్ని తమ పార్టీకే వస్తాయని గతంలో నే పాల్ ప్రకటించారు.

Telugu Jagan, Janasena, Janasenani, Kapaul, Pavan Kalyan, Ysrcp-Politics

తాను భారత ప్రధాని అవుతాను అంటూ కామెంట్లు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి పదవులను పంచేస్తాను అని పాల్ ప్రకటించారు.దీనిలో భాగంగా ఏపీలో ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ కు ఇస్తానని, జనసేన కార్యకర్తలు , పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజాశాంతి పార్టీ కి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  ప్రస్తుతం పాల్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ఆఫర్ పై జనసైనికులు మండిపడుతూ… వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube