భారత జవాన్లు సాహసాలతో అబ్బుర పరుస్తున్నారు.బోర్డర్ల దగ్గర పహరా కాయడమే కాదు తమ విన్యాసాలతో దేశ ప్రజలను ఆకట్టుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నారు.
తాజాగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) సరికొత్త రికార్డు సృష్టించారు.ఉత్తరాఖండ్ లోని టిబెటన్ బోర్డర్ పోలీసులు అరుదైన రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాహసం చేశారు.హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు.
గడ్డకట్ట చలిలో 20 నిమిషాల పాటు యోగా చేశారు.ఎత్తైన మౌంట్ అబిగామిన్ పర్వతంపై జవాన్లు ఈ యోగా చేసినట్లు ఐటీబీపీ అధికారులు ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
సెంట్రల్ హిమాలయాల్లోని జస్కర్ రేంజ్ లో ఈ పర్వతం ఉంటుంది.ఈ ప్రాంతంలో ఉన్న పర్వతాల్లో రెండోవ అతి పెద్ద పర్వతం అబి గామెన్.ఈ ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి బద్రి విశాల్ కీ జై అనే నినాదాలు చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.
14 మంది జవాన్లు యోగా చేస్తూ ఈ వీడియోలో కనిపించారు.ఐటీబీపీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.జవాన్ల సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.వారెవ్వా అంటూ హ్యాట్సప్ కొడుతున్నారు.ఇలాంటి విన్యాసాలు ఎక్కడా చూడలేదని అంటున్నారు.

కాగా ఇండియా-టిబెట్ బోర్డర్ లో సెక్యూరిటీ కోసం ఐటీబీపీ ఏర్పాటు చేశారు.ఇండియన్ ఆర్మీలో ఈ దళానికి చాలా ప్రత్యేకత ఉంది.దాదాపు 90 వేలకుపైగా జవాన్లు ఈ దళంలో పనిచేస్తున్నారు.హిమాలయ సరిహద్దులను రక్షించడంతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వీరు ఎక్కువ పనిచేస్తూ ఉంటారు.ఇందులో పనిచేసేవారు అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు.సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ పోలీస్ దళంలో వీళ్లు ఉంటారు.







