మెగా బ్రదర్ నాగబాబు 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆయన క్లారిటీ ఇవ్వడంతో నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు.నాగబాబు వరుసగా టీవీ షోలు చేస్తుండగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది.
నాగబాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
సర్కారు వారి పాట సినిమాలో నాగబాబు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నాగబాబు పలు సినిమాలలో నటించి నటుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగా పలు సినిమాలు నిర్మాతగా కూడా నాగబాబుకు మరింత మంచిపేరును తెచ్చిపెట్టాయి.ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో నాగబాబు పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.
ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉన్నా నాగబాబు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కాలేదు.

అయితే నాగబాబు ఈ ఏడాది వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఒక సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం అందుతోంది.పలు రియాలిటీ షోలకు జడ్జిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాగబాబు తన పాపులారిటీని పెంచుకున్నారు.జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి నాగబాబు ఎంతో కష్టపడుతున్నారు.
వైసీపీపై ఘాటుగా విమర్శలు చేయడంలో కూడా నాగబాబు ముందువరసలో ఉంటారు.

ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం నాగబాబు ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని సమాచారం అందుతోంది.2019 ఎన్నికల సమయంలో మాత్రం తనకు, తన భార్యకు 41 కోట్ల రూపాయల స్థిరాస్థులు, చరాస్థులు ఉన్నాయని నాగబాబు వెల్లడించారు.నాగబాబు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకుంటారేమో చూడాలి.
నాగబాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.నాగబాబుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.







