సూర్య నటించిన సినిమా లాంటి కథ నాకు వస్తే బాగుండు.. హీరో నాని!

టాలీవుడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నజ్రీయా నటించిన విషయం తెలిసిందే.

 Nani Talk About Ante Sundaraniki Movie, Ante Sundaraniki Movie, Nani, Nazriya Na-TeluguStop.com

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే.ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే.

అలాగే ఈ సినిమాతో హీరోయిన్ నజ్రియా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అన్న విషయం కూడా తెలిసిందే.జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బాగంగా బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా హీరో నాని మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా నాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ చిత్రంలోకి నజ్రియా ఎలా వచ్చింది? అని అడగగా.ఆ విషయంపై స్పందించిన హీరో నాని.

నేను, దర్శకుడు వివేక్‌ అనుకొని నజ్రియాను హీరోయిన్ గా తీసుకొచ్చాం.ఈ కథలో హీరోహీరోయిన్‌ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది.

లీలా పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన ప్రతిసారి మేమిద్దరం.నజ్రియాలాగే ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం.

నజ్రియాలాగా ఎందుకు ఆమెనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకొని కథ వినిపించాం.

Telugu Nani, Nazriya Nazim, Vivek Athreya-Movie

పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తేనే ఒప్పుకోని నజ్రియా.ఈ కథ విన్నవెంటనే ఎగిరి గంతేసి.చేసేద్దాం అని చెప్పారు.

కథను బాగా నమ్మితే తప్ప నజ్రియా ఒప్పుకోదు అని చెప్పుకొచ్చాడు నాని.అనంతరం అంటే సుందరానికి సినిమాలో మీరు అమాయకుడైన సుందరం పాత్రని పోషించారు.

ఆ పాత్ర గురించి వివరాలు అని ప్రశ్నించగా.ట్రైలర్‌ చూసి సుందరం చాలా ఇన్నోసెంట్‌, వాళ్ల నాన్న చేతిలో నలిగిపోతున్నాడు అనిపించొచ్చు కానీ.

వాడు చాలా వరస్ట్‌ ఫెల్లో.దర్శకుడు వివేక్‌ కూడా నాకు కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు.

వీడు వరస్ట్‌ ఫెలో సర్‌ కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి అని అన్నాడు.అలా చేయడం మాకు పెద్ద టాస్క్‌.

ఔట్‌పుట్‌ చాలా చక్కగా వచ్చింది అని చెప్పుకొచ్చాడు నాని.ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో నేను చేస్తే బాగుండు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా?అని ప్రశ్నించగా.సూర్య నటించిన జై భీమ్‌ సినిమా చూసినప్పుడు.ఇలాంటి కథ తెలుగులో వస్తే బాగుంటుంది అనిపించింది.అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.నాకు వస్తే ఇంకా హ్యాపీ అని తెలిపాడు నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube