క్యాసినోలో జూదం ఆడటమే తప్పు అనుకుంటే.ఈ క్రమంలో లక్షలు పొగొట్టుకున్న ఓ భారత సంతతి వ్యక్తి తన డబ్బు తనకు ఇప్పించాంటూ ఏకంగా కోర్టుకెక్కాడు.
వివరాల్లోకి వెళితే.దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి జూదమంటే పిచ్చి.
ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కాసినో వేదిక అయిన సన్ సిటీలో జూదం ఆడి.దాదాపు ఐదు మిలియన్ ర్యాండ్‌లు పొగొట్టుకున్నాడు.దీంతో తన డబ్బును తిరిగి ఇప్పించాలంటూ అతను కోర్టుకెక్కాడు.
సౌత్ గౌటెంగ్ హైకోర్టులో నమోదైన ఈ అసాధారణ కేసులో పిటిషన్‌దారుడిగా వున్న వ్యక్తి సుహైల్ ఎస్సాక్.
చట్టం నిషేధించిన జాబితాలో వున్న గేమింగ్ టేబుల్ వద్దకు తనను అనుమతించి సన్ సిటీ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించారని ఆయన కోర్టుకు తెలియజేశారు.ఒక సంస్థ లేదా సంబంధిత వ్యక్తి అభ్యర్ధన మేరకు క్యాసినో పరిసరాల్లోకి ప్రవేశించకుండా మినహాయించబడిన వ్యక్తుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయడానికి దక్షిణాఫ్రికా జాతీయ గ్యాంబ్లింగ్ చట్టం జాతీయ గేమింగ్ బోర్డుకు అధికారం ఇస్తుంది.
అయితే నవంబర్ 2017లో తన స్వంత అభ్యర్ధన మేరకు ఎస్సాక్ ఈ రిజిస్టర్‌లో చేర్చబడ్డాడు.అయితే సన్ సిటీలో జూదం ఆడేందుకు వచ్చాడు.సన్ సిటీ తనను యాక్సెస్ చేయడానికి అనుమతించడమే కాకుండా.కాసినో తన సొంత కార్డ్ కాదని తెలిసినప్పటికీ, 5.2 మిలియన్ ర్యాండ్‌ల జూదాన్ని ఆడేందుకు తన భార్య క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించేందుకు అనుమతించిందని ఎస్సాక్ చెప్పాడు.రిజిస్టర్‌లో తన పేరును చేర్చిన తర్వాత మళ్లీ అక్కడ జూదం ఆడేందుకు అనుమతించకూడదని సన్ సిటీకి చట్టబద్ధమైన బాధ్యత వుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అందువల్ల తాను కోల్పోయిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎస్సాక్ కోరాడు.

అయితే సన్ సిటీకి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ అయిన సన్ ఇంటర్నేషనల్ చేసిన వాదనను కోర్టు అంగీకరించింది.ఎస్సాక్ చట్టబద్ధమైన హోదాను తెలియజేసినప్పటికీ.అతను తన ఇష్టప్రకారమే జూదంలో పాల్గొన్నాడని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
జూదం నుంచి మినహాయించబడిన వ్యక్తుల జాబితాలో స్వచ్ఛందంగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత కూడా.సన్ సిటీ క్యాసినోకు వెళ్లి డబ్బును పొగొట్టుకున్నాడని న్యాయమూర్తి అన్నారు.







