అవును.అలాంటి అతిధితులు రావాలంటే కూసింత అదృష్టం ఉండాలి.అలాంటివి కలలో తప్పితే నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతాయి.అలాంటివి జరిగినప్పుడు వర్ణించడానికి మాటలు సరిపోవు.పైగా చేప్పినా అలాంటి విషయాలు నమ్మరు.అందుకేనేమో ఆమె ముందు జాగ్రత్తగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అవును.ఆ ఇంటికి వచ్చింది ఓ అందమైన అతిధి.
కాస్సేపు బాల్కనీలో సందడి చేసి, ఆ కుటుంబానికి ఆనందాన్ని పంచింది.కాసేపటి తరువాత ఆ ఎదురుగా ఉన్న మరో ఇంటికి వెళ్లి వారిని కూడా పలకరించింది.
ఇంతకీ ఆ అందమైన అతిధి ఎవరు, ఎక్కడ, ఏమిటన్నది ఇపుడు తెలుసుకుందాం.బాలీవుడ్ బాద్ షా అమితాబ్ నటించిన సినిమా నుంచి దేఖా ఏక్ ఖ్వాబ్‌తో యే సిల్సిలే హుయే… అంటూ మరింతగా యాప్ట్ అయ్యే పాటతో ఆ అందమైన అతిధి రాక గురించి ఆ ఇంటి యజమాని ఎంత అందంగా అందరికీ చెప్పిందో తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు.
safarnamabynidhiపేరుతో ఉన్న బ్లాగర్ ఈ వీడియోనూ పోస్ట్ చేసారు.చేసిన కాస్సేపటికే వైరల్ అయింది.దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరంలో అరుదైన దృశ్యమిది.
ఇంతకీ ఆ అందమైన అతిధి ఎవరో మీకు చెప్పలేదు కదూ. అదే నెమలి.అవును.
ఓ దశాబ్దంగా ఆ కుటుంబం ఆ అతిధి కోసం ఎదురు చేస్తోందట.ఆరోజు రానే వచ్చేసింది.
నిజంగానే నెమలి ఎంత అందమైందో..
అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.మీటరుకు పైగా పొడవైన నెమలి పింఛాల తోకతో… మిరుమిట్లు గొలిపే అందమైన నెమలి ఢిల్లీ వికాస్ పురి ప్రాంతంలోని ఓ ఇంటి బాల్కనీలో వాలింది.
అటూ ఇటూ సందడి చేసి.మరలా మరో ఇంటికి వెళ్లి వారిని కూడా తన అందంతో అలరించింది.
ఢిల్లీ వంటి నగరంలో నెమలి అంత స్వేచ్ఛగా తిరగడం చాలా అరుదైన విషయమే.ఇదంతా షూట్ చేసిన ఆ ఇంటి యజమాని అందమైన పాటను బ్యాక్‌డ్రాప్గా పెట్టి ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్ చేశాడు.
అదే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.







