ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.
బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.డబ్బింగ్ వర్షన్ ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అందులో ప్రొమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్ల మార్క్ టచ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు.

ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరొక వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 లో బన్నీ కొడుకు పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు.ఇందులో బన్నీ 55 ఏళ్ల వ్యక్తిగా కనిపించ నున్నాడని.బన్నీ కొడుకు పాత్రలో మరొక యంగ్ హీరో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు ఈ రూమర్ మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.







