అడివి శేష్ లీడ్ రోల్ లో 26/11 ముంబై ఎటాక్ నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన సినిమా మేజర్.శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.
శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇక సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఫస్ట్ డే 13.10 కోట్ల గ్రాస్ 7.12 కోట్ల షేర్ రాబట్టింది మేజర్.ఇక రెండో రోజు ఫస్ట్ డే కన్నా ఎక్కువ వసూళ్లని రాబట్టింది.
మేజర్ సినిమా రెండు రోజుల్లో 24.5 కోట్ల గ్రాస్ అంటే 13.48 కోట్ల షేర్ రాబట్టింది.ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 14.93 కోట్లు జరిగింది.అంటే బ్రేక్ ఈవెన్ కి ఇంకా కోటి మాత్రమే రావాల్సి ఉంది.ఈ సినిమాని నార్త్ ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది.సినిమాకు మొదటి రోజు కన్నా సెకండ్ డే అక్కడ 50 శాతం ఈక్యుపెన్సీ వచ్చినట్టు తెలుస్తుంది.మేజర్ సినిమా వసూళ్లతో ఇంకా మరెన్నో రికార్డులు కొల్లగొట్టాలని.
ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ తన జి.ఎం.బి ఎంటర్టైన్ మెంట్స్ లో మేజర్ సినిమా నిర్మాణ భాగస్వామ్యం అయ్యారు.