భారతదేశంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.ఎన్నో అందమైన, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
జీవితాంతం తిరిగినా ఇంకా చూడాల్సిన ఎన్నో ప్రకృతి అందాలు మన దేశంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు ప్రదేశాలు కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ప్రదేశాలు మన ఇండియాలో ఉన్న చివరి 5 ప్రదేశాలు అన్నమాట.ఆ చివరి ఐదు ప్రదేశాలుకు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
మరి ఆ ప్రదేశాలు ఏంటి.అవి ఎక్కడ ఉన్నాయి.
వాటి ప్రత్యేకత ఏంటి.అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.!.
భారతదేశ చివరి భూమి
మనం తెలుసుకోబోయే ప్రత్యేకమైన ప్రదేశాలలో మొదటిది ధనుష్కోడి.ఈ ప్రాంతాన్ని భారతదేశ చివరి భూమిగా అభివర్ణిస్తారు.ఎందుకంటే ఈ ప్రాంతంతోనే మన భారతదేశ రోడ్డు ముగుస్తుంది.
అందుకే ధనుష్కోడిని భారతదేశ చివరి రోడ్డుగా కూడా పిలుస్తారు.ఈ ధనుష్కోడి నుంచి 31 కిలోమీటర్ల ప్రయాణచేస్తే శ్రీలంక దేశం వచ్చేస్తుంది.
తమిళనాడుకు చెందిన పాంబన్ దీవుల్లో ఆగ్నేయ ప్రాంతంలో ఈ ధనుష్కోటి పట్టణం ఉంది.ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఎవరూ జీవించడం లేదు.
భారత దేశ ప్రాచీన చివరి రైల్వే స్టేషన్:
భారత దేశ చివరి ప్రదేశాల్లో రెండో ప్రదేశం బెంగాల్ మాల్దా జిల్లాలోని హబీబ్ పూర్ లో ఉన్న సింఘాబాద్ రైల్వే స్టేషన్.ఇది ఇండియాలో ప్రాచీనమైన చివరి రైల్వే స్టేషన్‌గా చెబుతారు.రైల్వేస్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దున కలదు.దీనిని స్వాతంత్రానికి ముందు నిర్మించారు.అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రైల్వే స్టేషన్ లో మార్పులు చేయలేదు.ఈ స్టేషన్ దాటితే మనం బంగ్లాదేశ్ కు చేరుకుంటాం.
భారతదేశ చివరి దుకాణం
భారత దేశం చివరి దుకాణాన్ని అక్కడి ప్రజలు హిందుస్థాన్ కి అంతిమ దుఖాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు.ఈ దుకాణం భారత్, చైనా సరిహద్దున ఉంది.
భారత్లో ఉన్న ఈ షాపు ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉంది.ఇది ఒక టీ షాపుగా తెలుస్తుంది.
ఈ షాపు చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

భారతదేశ చివరి గ్రామం
భారతదేశ చివరి గ్రామం చిత్కూల్ అని చెప్పవచ్చు.ఇది భారత్, టిబెట్, చైనా సరిహద్దులో భారత్ వైపున ఉంది.ప్రస్తుతం ఈ గ్రామంలో మనుషులు ఎవరు ఉండడం లేదు.
అలాగే ఉత్తరాఖండ్ లోని చమేలి జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని కూడా అధికారికంగా భారతదేశ చివరి గ్రామంగా గుర్తించారు.బద్రీనాథ్ గుడి దగ్గరలో ఉన్న ఈ గ్రామం కూడా పర్యాటక ప్రాంతంగా చెప్పుకొస్తారు.
ఈ గ్రామం సరస్వతీ నది ఒడ్డున ఉంది.







