మాజీ మంత్రిని టార్గెట్ చేసిన జనసేన.. ఎర్రకొండలు అంటూ ఆరోపణలు

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిన వారిలో అవంతి శ్రీనివాస్ ఒకరు.ఆయన్ను రాజకీయాల్లోకి తెచ్చింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.గురువు బాటలోనే అవంతి శ్రీనివాస్ కూడా గెలుపు బాటలోనే కొనసాగుతున్నారు.2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్.2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

 Janasena Targeted Ex Minister Avanti Srinivas, Andhra Pradesh, Avanti Srinivas,-TeluguStop.com

అయితే రాజకీయాల్లో రుణాలు ఉండవు అన్న రీతిలో అవంతి శ్రీనివాస్ గత పదేళ్ల కాలంలో మూడు పార్టీలు మారారు.

కానీ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మాత్రం టీడీపీ హయాం అప్పటి నుంచే అవంతి శ్రీనివాస్‌ను టార్గెట్ చేసింది.ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవంతి.

జనసేన పార్టీకి చేయూత ఇవ్వాల్సింది బదులు అవాకులు చెవాకులు పేలుతున్నారని జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

జనసేన ఆవిర్భావ సభలో అవంతి శ్రీనివాస్‌ను పవన్ కళ్యాణ్ ఏకంగా బంతి, పూబంతి, చామంతి అంటూ ఆరోపణలు చేశారు.

దీంతో అవంతి హర్ట్ అయ్యారు.తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా అవంతి శ్రీనివాస్‌ను టార్గెట్ చేశారు.

విశాఖ రుషికొండ సమీపంలోని ఎర్రకొండలను అవంతి శ్రీనివాస్ తినేస్తున్నాడంటూ ఘాటుగా విమర్శించారు.అంతేకాకుండా అవంతి కేరాఫ్ ఎర్ర కొండలు అని కొత్త బిరుదు తగిలించారు.

Telugu Andhra Pradesh, Avanti Srinivas, Naga Babu, Pawan Kalyan-Telugu Political

భీమిలి ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు మంత్రి పదవి వెలగబెట్టిన అవంతి ఎర్రకొండలను మింగేస్తున్నారంటూ నాగబాబు మండిపడ్డారు.విశాఖలోని రుషికొండ తవ్వకాలను అడ్డుకుంటోంది జనసేన పార్టీ మాత్రమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు.మరి నాగబాబు చేసిన ఆరోపణలకు బదులుగా అవంతి శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.మరోవైపు ఉత్తరాంధ్రలో సమస్యలు వస్తే పవన్ అవసరం లేదని.జనసైనికులు చాలని భావించేంతలా ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని నాగబాబు అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube