మెంతులు.రుచి పరంగా చేదే అయినా పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా రక్తపోటు స్థాయిలను అదుపు చేయడంలోనూ, అధిక బరువు సమస్యను నివారించడంలోనూ, గుండె జబ్బులు దరి చేరకుండా అడ్డుకట్ట వేయడంలోనూ, కంటి చూపును పెంచడంలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మెంతులు ఆరోగ్యానికి ఉపయోగడపడతాయి.
అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సామర్థ్యం కూడా మెంతులకు ఉంది.
ముఖ్యంగా మెంతులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని వాడితే.
ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం.మరి లేటెందుకు మెంతులతో ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను ఒక బౌల్లోకి తీసుకుని వాటర్‌తో రెండు సార్లు కడగాలి.ఆ తర్వాత అర గ్లాస్ వాటర్ పోసి నైటంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే నానబెట్టుకున్న మెంతులను వాటర్‌తో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి చిన్న మంటపై దగ్గర పడే వరకు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకుని.అప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్లే.దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఈ క్రీమ్‌ను నైట్ నిద్రించే ముందు ముఖానికి రాసుకుని.ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి సమస్యలుంటే దూరమై ముఖం బ్రైట్ అండ్ వైట్‌గా మెరిసిపోతుంది.