'అంటే సుందరానికి' సెన్సార్ కంప్లీట్.. క్లీన్ యు సర్టిఫికెట్ !

నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Censor Completed For Nani's Ante Sundaraniki, Ante Sundaraniki, Nani, Vivek Atre-TeluguStop.com

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా హిట్ తో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

ప్రెసెంట్ నాని అంటే సుందరానికి, దసరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.అంటే సుందరానికి సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంచాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఇది బాగా ఆకట్టు కుంది.ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమా నాని నుండి మరొకటి రాబోతుంది.

అయితే తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు.అంటే సుందరానికి సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది.

ఈ మేరకు మంత్రి వారు పోస్ట్ చేసారు.ఈ ఆవకాయ సీజన్ ను ఎంటర్టైన్మెంట్ తో ఎండ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఈ సినిమా ముందు నుండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందరికి తెలిసిందే క్లీన్ యు సర్టిఫికెట్ పొందడంతో ఈ సినిమా ఎలా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఈ సినిమాలో కూడా నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు.నాని నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.జూన్ 10న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube