ప్రముఖ టెలికాం కంపెనీ Airtel తన యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు తన ప్లాన్లను అప్ గ్రేడ్ చేస్తూ వస్తోంది.ఇపుడు కొత్తగా 3 కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను లాంచ్ చేసి, తన కస్టమర్లకు గాలం వేస్తోంది.అందులో ఒకటి రూ.1599 ప్లాన్, రెండోది రూ.1,099 ప్లాన్, ఇక ముచ్చటగా మూడోది రూ.699 ప్లాన్లు.ఇకనుండి వీటి ద్వారా Airtel 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 350కి పైగా చానెళ్లను ఫ్రీగా అందిస్తోంది.ఈ ప్లాన్లు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే 17 ప్రీమియం OTTలకు యాక్సెస్ పొందవచ్చు.
గమనిక: Airtel అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్లను సబ్‌స్క్రైబ్ చేసుకోగలరు.
1st ప్లాన్: Airtel రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
Airtel రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్, అలాగే Airtel రూ.1,498 ప్లాన్‌లు అనేవి ఇంచుమించు ఒకేరకమైన సర్వీసుని ఇస్తాయి.అయితే రూ.1,599 ప్లాన్ వలన 4k ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా చానెళ్లను తిలకించవచ్చును.అయితే ఇది కావాలంటే, వన్‌టైం చార్జ్ రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది.ఈ సెట్ టాప్ బాక్స్‌తో వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు OTT కంటెంట్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు.
ఇక ఈ ప్లాన్ ద్వారా 300mbps ఇంటర్నెట్ స్పీడ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్ ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు.అలాగే వివిధ చానళ్ళుతో పాటుగా 17 OTTలు ఉచితంగా లభిస్తాయి.

2nd ప్లాన్: Airtel రు.1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా నెలకు 200mbps వేగంతో 3.3 టీబీ డేటా లభిస్తుంది.పై ప్లాన్ ద్వారా లభించే అన్ని OTTలు దీని ద్వారా లభిస్తాయి.ఇక Airtel ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్ ద్వారా 350కి పైగా చానెల్స్ ఉచితంగా లభిస్తాయి.
3rd ప్లాన్: Airtel రు.699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఈ మూడింటిలో ఇది అత్యంత చవకైన ప్లాన్ అని చెప్పుకోవచ్చు.ఈ ప్లాన్ ద్వారా 40mbps స్పీడ్‌తో నెలకు 3.3 టీబీ డేటా పొందవచ్చు.నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పై 2 ప్లాన్లలో లభించే అన్ని OTTలు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్ ఉంటుంది.







