ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ గొప్పగా చెప్పిన ఈ మాటలు వింటే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన అభిరుచులను పంచుకున్నారు.మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే మహేష్ బాబుతో మల్టీస్టారర్ చేయాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు.

 Young Tiger Junior Ntr Comments About Fans Goes Viral Junior Ntr , Fans , Tolly-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే దానవీర శూరకర్ణ రీమేక్ లో తాను నటిస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తనకు రాజమౌళి, వీవీ వినాయక్, కృష్ణవంశీలలో ముగ్గురూ ఇష్టమేనని ఎన్టీఆర్ అన్నారు.

ముగ్గురు డైరెక్టర్లలో ఎవరు ముఖ్యం అనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తన ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్ అని ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని తారక్ తెలిపారు.

ఆది, సింహాద్రి సినిమాలలో బెస్ట్ మూవీ సింహాద్రి అని తారక్ తెలిపారు.అమ్మాయిలకు స్లిమ్ ఎన్టీఆర్ అంటేనే ఇష్టమని తారక్ కామెంట్లు చేశారు.నటన, రాజకీయాల గురించి తనకు పూర్తిగా తెలియదని తారక్ చెప్పుకొచ్చారు.

Telugu Fans, Ntr, Koratala Shiva, Rajamouli, Tollywood, Young Tiger Ntr-Movie

పాత్ర డిమాండ్ చేస్తే మళ్లీ బరువు పెరగడానికి తాను సిద్ధమేనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.కథ అంత అద్భుతంగా ఉంటే బరువు పెరగడంలో తప్పు లేదని అలాంటి పాత్రలు చాలా తక్కువమందికి దొరుకుతాయని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.మేము ఎంటర్టైనర్స్ అని కష్టపడకుండా ఫలితం దక్కదని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

కలలో కూడా నా అభిమానులు నా గురించి చెడుగా కోరుకోరని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు.అభిమానులు బాగుండాలని నేను కోరుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఫ్యాన్స్ పై కూడా తాను అంతే అభిమానం చూపిస్తున్నానని ఎన్టీఆర్ అన్నారు. ప్రతి ఫ్యాన్ నాకో వజ్రంతో సమానం అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube