గూగుల్ ద్వారా వైద్యం చేసుకునే వారికి షాకిస్తున్న డాక్టర్

ఇటీవల కాలంలో చిన్న పనికి కూడా గూగుల్‌పై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.ఎక్కడికి అయినా కొత్త ప్రదేశాలకు వెళ్తే, దానికి సంబంధించిన వివరాలను గూగుల్ మ్యాప్‌లో ఎక్కువగా చూస్తుంటాం.

 Dr. Who Is Healing Those Who Are Healed By Google, Google Treatment, Docter, Ch-TeluguStop.com

కొంత వరకు వీటిపై అవగాహన వస్తుందనేది వాస్తవం.అయితే పూర్తిగా గూగుల్‌పై ఆధారపడితే పక్కనే ఉండే ప్రదేశానికి కూడా చుట్టూ తిరిగి వెళ్లే ప్రమాదం ఉంది.

అంత వరకు పర్వాలేదు.ఇటీవల కాలంలో కొందరు గూగుల్‌పై ఆధారపడి, సొంత వైద్యం చేసుకుంటున్నారు.

ఇక డాక్టర్ల వద్దకు వచ్చే ముందు, తమకు ఉన్న వ్యాధి లక్షణాలను అందులో సెర్చ్ చేస్తున్నారు.దానికి ఉండే చికిత్స విధానాలపై అవగాహన తెచ్చుకుంటున్నారు.

ఇదే విషయం డాక్టర్లకు చికాకు రప్పిస్తోంది.డాక్టర్ల వద్దకు వచ్చి, తమకు ఏ చికిత్స కావాలో కూడా చెబుతుండడం వారికి డాక్టర్లకు ఆగ్రహం కలిగిస్తోంది.

దీంతో చిర్రెత్తుపోయిన ఓ డాక్టర్ తన క్లినిక్ ముందు పెట్టిన ఫీజుల బోర్డు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఆ ఫొటోలు, వీడియోలలో డాక్టరు తన క్లినిక్‌ ముందు పెట్టుకున్న ఫీజుల బోర్డు కనిపిస్తోంది.అందులో డాక్టరే రోగ నిర్ధారణ చేసి, ట్రీట్‌మెంట్ అందిస్తే ఫీజు రూ.200 మాత్రమే.డాక్టరు రోగ నిర్ధారణ చేసి, రోగి ఏ చికిత్స కావాలో తానే చెబితే ఫీజు రూ.500లుగా నిర్ణయించారు.గూగుల్‌లో చూసిన సమాచారంతో డౌట్‌లను అడిగితే ఫీజు రూ.1000. రోగి తనకు తానే రోగ నిర్థారణ చేసుకుని, దానికి డాక్టర్ చికిత్స అందిస్తే ఫీజు రూ.1500.రోగి తానే స్వయంగా రోగ నిర్ధారణ చేసుకుని, ఏ చికిత్స కావాలో తానే చెబితే దానికి డాక్టర్ ఫీజు రూ.2000.ఇలా ఐదు రకాల చికిత్సలను అందిస్తామని, దానికి తగిన ఫీజులు అవేనని ఆ బోర్డును డాక్టర్ తన క్లినిక్ ముందు ప్రదర్శించాడు.ఇది ఎక్కడ పెట్టారో, ఆ డాక్టర్ వివరాలేమిటో తెలియలేదు.

అయితే ఈ ఫీజుల బోర్డు మాత్రం బాగా వైరల్ అయింది.చాలా మంది ఆ డాక్టర్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

డాక్టర్‌ అనుభవంపై నమ్మకం ఉంచకుండా, గూగుల్‌పై ఆధారపడి అతి తెలివి ప్రదర్శించే వారికి ఇలా జరగాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube