రియల్‌ హీరో కథ 'మేజర్‌' ప్రివ్యూ

26/11 హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్‌’.డ్యూటీ లో ప్రాణాలు వదిలేసి దేశం మొత్తం సెల్యూట్‌ చేసేంతటి గొప్ప త్యాగం చేసిన వీరుడు మేజర్ సందీప్‌.

 Adivi Shesh And Sai Manjrekar Movie Major Preview Adivi Shesh, Sai Manjrekar, M-TeluguStop.com

అలాంటి మేజర్ కు ఈ సినిమా నిజమైన ఘన నివాళి అంటూ యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఈసినిమాను చేయాలని భావించినా కూడా అడవి శేషు ఈ సినిమాను ముందుకు తీసుకు వచ్చాడు.

వారు అనుకుంటూ ఉండగానే అడవి శేషు కథ ను రెడీ చేయించడంతో పాటు తనకు సన్నిహితుడు అయిన శశి కిరణ్‌ తిక్క తో దర్శకత్వం చేయించాడు.ఈ సినిమా లో శోభిత దూళిపాళ్ల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా నటించారు.

మేజర్ కాలేజ్ డేస్ నుండి మొదలుకుని 26/11 దాడుల్లో మృతి చెందే వరకు కూడా అన్ని విషయాలను కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి.కాస్త కల్పితం జత చేసి తెరకెక్కించడం జరిగింది.

మేజర్‌ ఉన్ని కృష్ణ పాత్రలో అడవి శేష్ పూర్తిగా ఒదిగి పోయాడు.పూర్తిగా మేజర్ ను దించేశాడు అన్నట్లుగా లుక్ ను మార్చుకున్నాడు.

రియల్‌ యుద్ద సన్నివేశాలు.దాడులు.

ఉగ్ర పోరాటాలను సినిమాలో చూపించడంతో పాటు ఉన్నికృష్ణ యొక్క గొప్పతనంను చూపించబోతున్నారు.తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పై పెచ్చు ఈ సినిమా నిర్మాణం లో తెలుగు సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఉండటం వల్ల అంచనాలు మరింతగా ఉన్నాయి.సోని వారి తో కలిసి మహేష్‌ నిర్మించిన ఈ సినిమా రేపు అంటే జూన్‌ 3వ తారీకున విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube