రాజకీయంగా చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.ఒకటి రెండు సార్లు కేసీఆర్ నేరుగా జగన్ పై విమర్శలు చేసినా ఆయన స్పందించలేదు.
ఇటీవల కాలంలోనే జగన్ నేరుగా విపక్ష నేతలపై విమర్శలు చేస్తున్నారు.జాతీయ రాజకీయాల్లో బీజేపీ అగ్రనేతలతో సఖ్యంగానే ఉంటున్నారు.
జగన్ అడగగానే ప్రధాని మోడీ , అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నారు.వెళ్ళగానే కలుస్తున్నారు.
అడగగానే నిధులు మంజూరు చేస్తున్నారు.అయితే కొన్నివిషయాల్లో జగన్ ఎవ్వరి మాట వినకుండా మొండిగా వ్యవహరించారు
చంద్రబాబు అప్పటికే ఏపీని అప్పుల కుప్పగా మార్చాడు.
పోతూ పోతూ ప్రభుత్వ ఖజానాలోని ప్రతీ రూపాయిని ప్రజలకు పప్పూ బెల్లాల్లా పంచేశారని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు.ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.2 లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చా.తప్పకుండా అమలు చేశారు.నవరత్నాల నుంచి అన్నింటికి బడ్జెట్ లేకున్నా అప్పులు తెచ్చి సర్దుబాటు చేశారు.
ఆదాయ మార్గాలు అన్వేషించి పూర్తి చేస్తున్నారు.పింఛన్ నుంచి పథకాల వరకూ ఠంఛన్ గా అన్నింటి సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు.
ఏపీలో రోడ్ల దుస్థితి బాగా దిగజారిందన్న విమర్శ ఉంది.క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా అంత బాగా లేవు.

దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు.ప్రశంసలు దక్కాయి.వలంటీర్ల వ్యవస్థతో ఏకంగా 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.ఎన్నో రకాల సేవలను అందిస్తూ ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.పెన్షన్ మొదలు ఏ పథకమైనా గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు.రాష్ట్రంలో 11152 గ్రామ సచివాలయాలు, 3913 వార్డు సచివాలయాలు ఉన్నాయి.వీటిల్లో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు.
అమ్మఒడి, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలు జగన్ ను ప్రజలకు చేరువ చేశాయి.పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
అయితే పన్నుల ద్వారా అందే సొమ్ము అంతా సంక్షేమ పథకాలపై ఖర్చు చేయడం పై విమర్శలు లేకపోలేదు.జగన్ పేదలను సోమరిపోతులుగా మారుస్తున్నారని అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.







