ఇటీవల ఏపీ ప్రభుత్వం కోన సీమ ప్రాంతాన్ని అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయటంతో విద్వేషకరమైన వాతావరణం నెలకొనడం తెలిసిందే.ఏకంగా వైసీపీ మంత్రి మరియు ఎమ్మెల్యే ఇళ్ళ పై ఆందోళనకారులు దాడులకు పాల్పడటం జరిగింది.
దీంతో వెంటనే ప్రభుత్వం కోనసీమ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేయటం తెలిసిందే.దాదాపు వారం రోజులపాటు గా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కోనసీమ ప్రాంతంలో వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు.
మరికొంతమంది వర్గాలకు చెందిన వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటర్నెట్ సేవల విషయంలో ఆ ప్రాంతానికి చెందిన యువకులు మరియు ఉద్యోగులు వివిధ వ్యాపారాలకు చెందిన వాళ్లు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తూ ఇంటర్నెట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఇదే విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగింది.దీనిలో భాగంగా ముందుగా ఐ పోలవరం, సఖినేపల్లి, మలికిపురం, అత్రేయపురం మండలాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఎస్పీ సుబ్బారెడ్డి లేఖ రాయగా, ఈ లేఖను జిల్లా అధికారులు హోంశాఖ కార్యదర్శికి పంపారు.
మిగిలిన కోనసీమ మండలాల్లో ఆంక్షలు కొనసాగనున్నాయి.







