సరదాగా మనం చేసే కొన్ని విహార యాత్రలు విషాదాన్ని నింపుతాయి.అందుకే విహార యాత్రలకు వెళ్ళే ముందు తప్పకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు అనుభవం లేని సాహస యాత్రల విషయంలో ఎలా జాగ్రత్త పడాలి వంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అమెరికాలో ప్రమాద వశాత్తు మరణించిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు.బోటు లో షికారుకు వెళ్లి నదిలో పది మృతి చెందిన వారు, కొండ పైకి ఎక్కి ప్రమాద వశాత్తు పడిపోయి మృతి చెందిన వారు, రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారు ఇలా ఎన్నో సంఘటనలలో మన భారత ఎన్నారైలు మృతి చెందిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడిన ఏపీ కి చెందిన సుప్రజ అనే మహిళ తన కుటుంభంతో కలిసి మంగళవారం రోజున విహార హాత్రకు వెళ్ళారు.
ఇందులో భాగంగా సుప్రజ తన కొడుకు అఖిల్ తో కలిసి ప్యారాచూట్ ఫ్లైయింగ్ రైడ్ చేశారు.ఈ క్రమంలో ఊహించని విధంగా ప్యారాచూట్ లో కలిగిన టెక్నికల్ సమస్య కారణంగా ఒక్కసారిగా ప్యారాచూట్ కుప్ప కూలిపోయింది అత్యంత వేగంగా సుప్రజ కిందకి కొడుకుతో సహా పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు అఖిల్ కి గాయాలు అయ్యాయి.
సుప్రజను హుటాహుటిన ఆసుపత్రుకి తరలించిన ఫలితం లేకపోయింది.ఈ విషయాన్ని భర్త ఏపీలోని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారి పాలెం లో ఉన్న సుప్రజ కుటుంభ సభ్యులకు తెలుపడంతో వారి కుటుంభం విషాదంలో నిండిపోయింది.
సుప్రజ మృత దేహాన్ని ఏపీలోని సొంత ఊరుకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా ఆమె మృత దేహం సొంత ఊరుకు పంపేందుకు స్థానికంగా తెలుగు సంఘాలు సహాయసహకారాలు అందిస్తున్నాయి.







