జూన్ 17 న విడుదల కు సిద్ధమైన ' కిరోసిన్ చిత్రం'

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా *కిరోసిన్*.క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు.

 Unique Crime Thriller Kerosene Releasing In Theatres On June 17th , Dhruva, Pree-TeluguStop.com

ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.ఎన్నో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.

ఈ పోస్టర్ ను బట్టి ఓ కొత్త పాయింట్ ను సినిమా లో చూపించబోతున్నారని ప్రేక్షకులకు చెప్పకనే చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube